
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఇటీవల జోరుగా చర్చ సాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందని పేర్కొనడంతో ఇక ముందస్తు ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ ముందస్తు ఎన్నికలపై నేడు మంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు. ముందస్తు ఆశలపై నీళ్లు చల్లారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైతుదన్నారు. పార్టీ చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయలేదని పేర్కొన్నారు.
Also Read : తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?
ఇసందర్బంగా అయన మాట్లాడుతూ తమకున్న సమాచారంతో టీఆర్ఎస్ 90 సీట్లలో గెలుస్తుందని, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం తథ్యమని అయన తెలిపారు. మా పార్టీలో ఉన్న విభేదాలు మా బలానికి నిదర్శనమని ఎవరిని బలప్రయోగం చేయలేదన్నారు. దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎం అయిన నేత లేరు. వచ్చే ఎన్నికల్లో బలాలు.. బలహీనతలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని అయన స్పష్టం చేశారు. కేంద్రం అభివృద్ధిలో తెలంగాణ ఉంది.. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదని, నేను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తెలంగాణ గవర్నర్ తో మాకు పంచాయితీ లేదన్నారు. రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే స్వాగతిస్తామని, కాంగ్రెస్ పాలనలో ఎట్లున్నది.. ఇప్పుడు ఎట్లున్నదనేది రాహుల్ చూడాలన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్లలో ఉండాలని, కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలన్నారు. రాహుల్‌కి అమేథి, రేవంత్‌కి కొడంగల్‌లో చెల్లని నాణేలు అని ఎద్దేవా చేశారు.
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్… అభ్యర్ధుల ఎంపికలో కొత్త వ్యూహం
పోడు భూముల సమస్యల పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమే పోడు భూముల చట్టాన్ని సవరణ చెయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రానికి శిత్తశుద్ధి ఉంటే పోడు భూముల చట్టాన్ని సవరణ చెయాలని, కేంద్రం చట్ట సవరణ చేస్తే వెంటనే పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి తెస్తే వాళ్ల చేతితోనే గిరిజనులకు పట్టాలు ఇప్పిద్దామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమి ఉండదన్నారు. ట్రైబల్ హక్కులను కాలరాసే యాక్ట్‌లను కేంద్రం తెబోతోందని చెప్పారు. పార్లమెంట్‌లో ఆ యాక్ట్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. 12లక్షల ఎకరాలు పట్టాలు అవ్వాలని లెక్కలు వస్తున్నాయన్నారు.ROFR చట్టం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కట్ ఆఫ్ డేట్ పెంచి, ROFR చట్టాన్ని సవరణ చేస్తే పోడు భూముల సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ….
- సమంత – చైతన్య విడాకులపై మురళీమోహన్ ఆసక్తికరమైన కామెంట్..!!
- భార్య ప్రియుడితో లేచిపోయిందని తనువు చాలించిన భర్త…
- లేటు వయసులో ఘాటు ప్రేమ.. బాలివుడ్ స్టార్ సుస్మితాసేన్ తో లలిత్ మోదీ డేటింగ్
3 Comments