
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరోసారి దాడి జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కర్రలు, రాళ్లతో కొందరు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అర్వింద్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఎంపీ అర్వింద్ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చనందుకే దాడి జరిగిందని తెలుస్తోంది. ఐతే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారని ఆరోపిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడిని కేంద్రమంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. పక్క ప్రకారమే తనపై దాడి జరిగిందని..బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని అమిత్‌షాకు వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీఆర్ఎస్ దాడులు చేస్తోందన్నారు. తాను ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నేతలకు సూచిందని అమిత్ షాకు తెలిపారు. ఇవాళ్టి దాడి వెనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని ఆరోపించారు.
One Comment