
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి విరుచుకుపడడంలో ముందుంటారు. ఇవాళ మరోసారి తండ్రీకొడుకులపై విజయసాయి ఘాటు ట్వీట్లు చేశారు. అవి ఏంటంటే…
Also Read : కొడుకు కోసం కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా కొనిచ్చిన రోజా .. రోజాపై టీడీపీ విమర్శలు
“తల్లిదండ్రులు మరణిస్తే తలకొరివి పెట్టనోడివి, సోదరుణ్ణి గొలుసులతో బంధించినోడివి. లోకేష్ తాత ఎవరంటే ఖర్జూరనాయుడు పేరు దాచిపెట్టి ఎన్టీఆర్ అంటూ ప్రచారం చేస్తున్నోడివి. నువ్వు కుటుంబం విలువలు గురించి మాట్లాడటం ఏంటి చంద్రబాబు”…..”లక్షల కోట్ల అమరావతి స్కామ్ మొదలు ఇసుక, మట్టి, లేటరైట్, పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని మందుల వరకు మాఫియా వ్యవస్థలను సృష్టించి చెదపురుగుల్లా రాష్ట్రం మీదకు వదిలిన చరిత్ర నీదే కదా గుంటనక్క నాయుడూ! దొంగే దొంగ అని అరిస్తే ఎలా?”
Read Also : ఖరారైన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం..??
“నీ కరకట్ట ఇంటి దగ్గరే కృష్ణలో ఇసుక అక్రమ డ్రెడ్జింగుతో కృత్రిమ ద్వీపాల ఏర్పాటుకు అనుమతించిన కేటుగాడివి. రిక్రియేషన్ సెంటర్లు వస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చని కుల మీడియాలో రాయించావు. నువ్వు పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడటం ఏంటి అల్జైమర్స్ నాయుడూ?”….. ఇలా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ట్వీట్ల దాడి జరిగింది. విజయసాయిరెడ్డిపై లోకేశ్, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, టీడీపీ సోషల్ మీడియా తమ మార్క్ విమర్శలు చేయడం చూశాం. తాజా ఘాటు ట్వీట్లపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి పాలకప్రతిపక్ష పార్టీల నేతలు మర్యాదగా మాట్లాడుకునే, ట్విట్లు చేసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి :
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
- మత్స్యకారులకు దొరికిన 16 అడుగుల అరుదైన చేప..
- మృత్తుల కుటుంబాలకు న్యాయం చేయాలనీ ధర్నా..
- ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
- తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?