
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అపర చాణిక్యం ఉండబోతున్నదన్నది టిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఈసారి గతానికి భిన్నంగా కెసిఆర్ సరికొత్త వ్యూహం తో అభ్యర్థుల ఎంపికలో కీలక అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఆదరించి, సీఎంగా కేసీఆర్ కు పట్టం కట్టారు. ఇక మూడో సారి మళ్ళీ అధికారం చేపట్టడం అంత సులభం కాదని భావిస్తున్న నేపథ్యంలోనే, కెసిఆర్ ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లాలని అడుగులు వేస్తున్నారు.
Also Read : లేటు వయసులో ఘాటు ప్రేమ.. బాలివుడ్ స్టార్ సుస్మితాసేన్ తో లలిత్ మోదీ డేటింగ్
అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ పైనా గులాబీ బాస్ ఫోకస్
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పార్టీ బలం, పార్టీ ఇమేజ్ ఆధారంగా ఓట్లు పడ్డాయి. ఈసారి కేవలం పార్టీ మాత్రమే అభ్యర్థులను గెలిపించ లేదని కెసిఆర్ భావిస్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా ముఖ్యం అని భావిస్తున్నారు. ఫలితాలు పార్టీ అభ్యర్థుల ఇమేజ్‌తో లాభపడేలా ఉంటాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే మంచి ఇమేజ్ వున్న నాయకులను రంగంలోకి దించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : ‘ఆరా’ సర్వే ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్, బిజేపి
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను టార్గెట్ చేసి … ఆపరేషన్ ఆకర్ష
షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా పోరుకు సిద్ధమయ్యేలా టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు ముందే వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ల సీట్లు సింగిల్ డిజిట్ కి పరిమితం చేసేలా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఈ వ్యూహంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’ కూడా ఉంది. ప్రత్యర్థి పార్టీల్లో అభ్యర్థులు కాబోయే వారిని గుర్తించి పార్టీలో చేర్చుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారు . అదనంగా, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించడానికి పార్టీ ఐప్యాక్ బృందంతో పాటు, మరికొన్ని ఏజెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.
Read Also : విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి… ముగ్గురికి తీవ్ర గాయాలు
నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ తో పాటు బహుళ సంస్థల సర్వేలు
నియోజకవర్గాల వారీగా నివేదికలు ప్రతికూలంగా ఉంటే, సిట్టింగ్ అభ్యర్థికి బదులుగా ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా సర్వేలు చేసే ఏజెన్సీలు టీఆర్‌ఎస్ అభ్యర్థుల అవకాశాలపై సర్వేలు చేయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే అభ్యర్థుల అవకాశాలపై అంచనా నివేదికలను కూడా ఇస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐ-పాక్ బృందం చేస్తున్న దానికి అదనంగా ఈ సర్వే ఉంటుందని సమాచారం. సర్వే బృందం ముగ్గురు నుంచి నలుగురు భావి అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల్లో గెలవగలరా లేదా అని విశ్లేషిస్తుంది.
Read Also : కొడుకు కోసం కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా కొనిచ్చిన రోజా .. రోజాపై టీడీపీ విమర్శలు
40 నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు..
ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐప్యాక్ సర్వే నిర్వహించింది. దాదాపు 40 నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఐ-ప్యాక్ నివేదిక సూచించినట్లు సమాచారం. సర్వే నివేదికలో అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ఆర్థిక స్థితిగతులు, సిట్టింగ్ అభ్యర్థిపై ప్రజాభిప్రాయం వంటి వివరాలు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలోనూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ జెండాను ఎగుర వేయటం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు అటు పార్టీలోనూ, ఇటు ప్రత్యర్థి పార్టీలలోనూ ఆసక్తికర చర్చకు కారణం గా మారాయి.
ఇవి కూడా చదవండి :
- అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్….
- నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
- శిష్యుడిలో రోషం… బాబులో మచ్చుకైనా లేదే…!
- సిఎం కెసిఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్…
2 Comments