
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న రోజా మంత్రి పదవి చేపట్టిన నాటి నుండి, తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. జగనన్న చెల్లెలినని నిత్యం టిడిపి అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై, తెలుగుదేశం పార్టీ నాయకుల పై తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చే రోజాపై అదే స్థాయిలో టిడిపి నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. మంత్రి రోజా ఏం చేసినా అందులో తప్పులు వెతకడంలో తెలుగుదేశం పార్టీ బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది.
Read Also : ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక…
తాజాగా మంత్రి రోజా తన కొడుకు కృష్ణ కౌశిక్ కోసం గిఫ్ట్ గా ఇవ్వడానికి GLS 400D మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. కోటి యాభై లక్షల రూపాయల విలువైన లగ్జరీ కారు కొడుకు కోసం రోజా కొనుగోలు చేయడంతో పాటు ఆ కారును తన కొడుకు గిఫ్ట్ గా ఇస్తూ సంతోషంతో ఉన్న రోజా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేసి మంత్రి రోజాను టార్గెట్ చేసిన టిడిపి ఓ రేంజ్ లో మంత్రి రోజాపై ఆరోపణలు చేసింది. మంత్రిగా రోజా బాగానే సంపాదిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా టిడిపి అధికార ట్విటర్ ఖాతాలో సెటైర్లు వేసింది.
Also Read : శిష్యుడిలో రోషం… బాబులో మచ్చుకైనా లేదే…!
మంత్రి గారికి అపాయింట్మెంట్ లో బాగానే వస్తున్నట్టు ఉన్నాయి. బాగానే వెనకేశారు అంటూ రోజా ని టార్గెట్ చేసిన టీడీపీ కలెక్షన్ క్వీన్స్ అంటూ ఇద్దరు మహిళా మంత్రుల ఫోటో ని ఆ పోస్టులో యాడ్ చేశారు. మంత్రి విడదల రజిని, మంత్రి రోజాను టార్గెట్ చేసిన టీడీపీ కలెక్షన్ క్వీన్స్ అంటూ పేర్కొంది అపాయింట్మెంట్ కోసమే 50000 వీళ్ళిద్దరికీ కట్టాలంట అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక అపాయింట్మెంట్ కోసమే 50 వేల రూపాయల తీసుకుంటున్న రోజా, కొత్త బెంజ్ కారు కొనుగోలు చేయడం విచిత్రం ఏమీ కాదు అన్న ధోరణిలో టిడిపి టార్గెట్ చేసింది.
Also Read : ప్రజాదరణలో కేసీఆర్ 11వ స్థానం… దిగువ నుంచి ఆరో స్థానం (20)లో జగన్…
అయితే రోజా అనుచరులు మాత్రం టీడీపీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సినిమాలలోనూ, టెలివిజన్ రంగంలో రాణించిన రోజా బెంజ్ కారు కొనుగోలు చేయలేనంత దారుణమైన పరిస్థితిలో లేరని, మంత్రి అయిన తర్వాత ఆమె సంపాదన పెరగలేదని, వైసిపి నేతగా, మంత్రిగా రోజా పనితీరును సహించలేకే టిడిపి విమర్శలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. రోజాకు అడ్డదారిలో సంపాదించాల్సిన అవసరం లేదని వారు చెప్తున్నారు. టీడీపీ నేతలే అటువంటి పనులు చేస్తారని ఎదురుదాడి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
- క్రిమినల్ కేసుల టాప్ లిస్టులో సీఎం కేసీఆర్!
- తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీనే! ఆరా సంస్ఖ సర్వే ఫలితాల్లో సంచలనం
- నల్గొండ జిల్లాలో గవర్నర్ తమిళి సైకు అవమానం
2 Comments