
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ‘ఆరా’సంస్థతో సర్వే రిపోర్టు ఇప్పించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా సర్వే సంస్థ రిపోర్టు మార్చిందన్నారు. ఆరా సంస్థ చైర్మన్ తనతో వస్తే నిరూపిస్తానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదని, టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ అంతర్గత సర్వే ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 99 సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారని వెల్లడించారు. అయినా కాంగ్రెస్ కేడర్ ఇలాంటి సర్వేలను నమ్మదని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ‘ఆరా’పోల్ స్ట్రాటజీస్ సంస్థ అధినేత ఆరా మస్తాన్ స్పందించారు. తమ సంస్థ సర్వే పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించిన వివరాలు అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ 38.88 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు 2019 పార్లమెంటు ఎన్నికల నాటికి ఓట్ల శాతం 41.71కి తగ్గిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38.88 శాతానికి పడిపోయినా, అత్యధిక శాతం ప్రజల మద్దతున్న పార్టీగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూఓట్ల శాతం తగ్గుతూ వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 23.71 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి పుంజుకుంటూ వచ్చిన బీజేపీకి 30.48 శాతం ఓట్లు లభిస్తాయన్నారు. ఇతరులకు 6.91 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి 119 నియోజకవర్గాల్లోని మూడో వంతు నియోజకవర్గాల్లో 2021 నవంబర్, ఈ ఏడాది మార్చి, ప్రస్తుత నెలలో సర్వేలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
Read Also : అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్….
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆరు శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరుగుదల మామూలు విషయం కాదన్నారు. ఓప్రైవేట్ సంస్థ సర్వే నివేదికను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘బీజేపీ గ్రాఫ్ పెరిగితే టీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. ప్రజలు మా పోరాటాలను గమనిస్తున్నారు’అని అన్నారు.
Read Also : కొడుకు కోసం కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా కొనిచ్చిన రోజా .. రోజాపై టీడీపీ విమర్శలు
సీఎం కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి, ప్రజలను ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయడంతోపాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీనే! ఆరా సంస్ఖ సర్వే ఫలితాల్లో సంచలనం
- నల్గొండ జిల్లాలో గవర్నర్ తమిళి సైకు అవమానం
- విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి… ముగ్గురికి తీవ్ర గాయాలు
- ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక…
2 Comments