
- నకిలీ మద్యం విక్రయం, తయారీలపై విచారణ జరపాలని దరఖాస్తు.
- వైన్స్ యాజమాన్యం,అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు.
- మైనర్లతో మద్యం సరఫరా,నకిలీ యజమానిపై విచారణ జరపండి.
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): జిల్లాలోని మర్రిగూడ మండలంలో ఉన్న మూడు వైన్స్ లపై స్థానిక మర్రిగూడ ప్రజలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.బాల కార్మికులతో పని చేయిస్తూ,నకిలీ మద్యం సరఫరా లపై వారు కమిషన్ లో పిర్యాదు చేసారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ పరంగా ఇచ్చిన టెండర్లను గాలికి వదిలేసి,ఈ మూడు వైన్స్ లను గతంలో టెండర్ పొందిన వ్యక్తితో అనధికారికంగా సిండికేట్ కావటం,అదంతా అధికారుల కనుసన్నలో నడవటంపై నీరసించిపోయామని మండల వాసులు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ లో పిర్యాదు చేశామని తెలిపారు. గత కొంత కాలంగా మర్రిగూడ వైన్స్ లను టెండర్లు వేసి దక్కించుకున్న వ్యక్తికి, ఈ సారి టెండర్ రాకపోవటంతో వేరు వేరు వ్యక్తులకు అధికారికంగా వచ్చిన వైన్స్ లను అగ్రిమెంట్ మీద, మాజీ యజమానికి పట్టం కట్టినట్లు తెలుస్తుంది.
Read More : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు ! పంటల సాగు సమయంలో
నెలసరి లాభాలు లెక్క చూసి పర్సెంటేజ్ ప్రకారం నగదు పంపిస్తున్నట్లు అనుకుంటున్నారు.ఏ సంబంధం లేని వ్యక్తికి వైన్స్ లపై అధికారం ఇవ్వటంతో, పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు, తనకు ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు. అందరికి సమన్యాయం జరగాలనే సంకల్పంతో ప్రభుత్వం విభజించిన రిజర్వేషన్ లను లెక్క చెయ్యకుండా,సిండికేట్ కావటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మైనర్లతో పని చేయిస్తూ, నకిలీ మద్యం తయారి చేస్తున్న వ్యక్తులపై, విచారణ జరిపి సంబంధిత శాఖ అధికారులపై, నకిలీ యజమానిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరారు. సంబంధిత పూర్తి వివరాలు పరిశీలించి కేసు నమోదు చేస్తామని అన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి …
- అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్
- కీచక ఎస్ఐ అరాచకాలు… స్టడీ మేటిరియల్ ఇస్తానంటు యువత
- కోట్లకు పడలేత్తిన సిఐ నాగేశ్వరరావు…. ప్రయివేటు సేనతో కలక్షన్లు..
- కూసుకుంట్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నేతలు…
- ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
3 Comments