
క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా : తెలంగాణ గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. తనను తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తోందని తమిళి సై బహిరంగంగానే చెబుతున్నారు. అయితే దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇటీవలే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ప్రమాణ స్వీకరోత్సవానికి రాజ్ భవన్ వచ్చారు. ఈ సందర్బంగా గవర్నర్ తో సరదాగా మాట్లాడారు. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని అంతా భావించారు. కాని అలాంటిదేమి లేదని తెలుస్తోంది. నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన గవర్నర్ కు మరోసారి అవమానం జరిగింది.
Read More : అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్..
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి మరణ శిలాశాసనం, కాంస్య విగ్రహం సందర్శనకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. గవర్నర్ అధికారిక పర్యటన కావడంతో ఆమెకు నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరీ స్వాగతం పలకాల్సి ఉంది. కానీ వారెవరూ అక్కడికి హాజరుకాలేదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ గవర్నర్‌కు స్వాగతం పలికినా కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆదేశాలతోనే నల్గొండ కలెక్టర్, ఎస్పీలు గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి …
- ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక…
- మరో మూడు రోజుల పాటు సెలవులు పొడగించే అవకాశం..!
- సిఎం కెసిఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్…
- ప్రజాదరణలో కేసీఆర్ 11వ స్థానం… దిగువ నుంచి ఆరో స్థానం (20)లో జగన్…
- ద్రౌపదీ ముర్ముతో టిడిపి ఆత్మీయ బేటి…