
క్రైమ్ మిర్రర్, అమరావతి ప్రతినిధి : ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన ద్రౌపదీ ముర్ము ఏపీ టూర్ కోసంవచ్చారు. ఇక్కడి రాజకీయ పార్టీలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ముందుగా సీఎం జగన్ ఇంటికి వెళ్లిన ఆమె అనంతరం.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత ఆమె విజయవాడకు వచ్చి గేట్ వే హోటల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.
Also Read : ముఖ్యమంత్రికి చల్లారిపోయిన టీ.. ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్
గేట్ వే హోటల్లో ద్రౌపదీ ముర్ముకు మద్దతుగా టీడీపీ నిర్వహించిన ఆత్మీయ భేటీలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, సోము వీర్రాజు కూడా హాజరయ్యారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్ధి కావడంతో ఈ సమావేశానికి వారిద్దరూ వచ్చారు. ఈ సందర్భంగా అత్యున్నత రాజ్యాంగ పదవికి తాము ఓ గిరిజన మహిళను తొలిసారి నిలబెట్టామని సోము వీర్రాజు గుర్తుచేశారు. గతంలోవాజ్ పేయ్ హయాంలో తొలిసారి ఓ ఎస్టీకి కేంద్రమంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ప్రధాని మోడీ ఏకంగా గిరిజన మహిళకు భారత్ లోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా నిలబెట్టారన్నారు. ఎన్డీయే మిత్రపక్షాలు రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టిన ద్రౌపదీ ముర్ముకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వచ్చందంగా ముందుకొచ్చి మద్దతిచ్చినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి, ఎక్కువకాలం గవర్నర్ గా కూడా పనిచేసిన ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్దిగా నిలబెట్టడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్డీయే భాగస్వాములతో పాటు మొత్తం 42 పార్టీలు ముర్ముకు మద్దతిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఎన్డీయే తరఫున అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసినప్పుడు చంద్రబాబు మద్దతిచ్చారని ఆయన గుర్తుచేశారు.
Also Read : మర్రిగూడ వైన్స్ లపై హెచ్ఆర్సిలో పిర్యాదు… నకిలీ మద్యం విక్రయం
గ్రామస్ధాయి నుంచి అంచెలంచెలుగా పైకి వచ్చిన గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రధాని మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ముర్మువంటి వ్యక్తిని అత్యున్నత పదవికి ఎంపిక చేసి సామాజిక న్యాయం కోసం ముందుకొచ్చినప్పుడు టీడీపీ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని భావించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోడీ రైట్ ఛాయిస్ అంటూ చంద్రబాబు ముర్మును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముర్ముకు మద్దతివ్వడం గర్వించదగిన అంశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరు ప్రజాప్రతినిధులు మీకు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ముర్ముకు తెలిపారు. చివర్లో మాట్లాడిన ద్రౌపదీ ముర్ము తనకు మద్దతిస్తున్న ఏపీ ప్రజాప్రతినిధులకు తెలుగులోనే ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ద్రౌపదీ ముర్ము అంటే ఎవరో తానే పరిచయం చేసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా తాను అడక్కపోయినా మద్దతు ప్రకటించిన చంద్రబాబును నేరుగా కలవాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు ద్రౌపదీ ముర్ము తెలిపారు. టీడీపీ తరఫున తనకు ఇచ్చిన మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్ వివరణ అందుకేన….
- కీచక ఎస్ఐ అరాచకాలు… స్టడీ మేటిరియల్ ఇస్తానంటు యువతి పై…..
- కోట్లకు పడలేత్తిన సిఐ నాగేశ్వరరావు…. ప్రయివేటు సేనతో కలక్షన్లు..
- కూసుకుంట్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నేతలు…
One Comment