
క్రైమ్ మిర్రర్, మాహాదేవ్ పూర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో మాహాదేవ్ పూర్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజా జీవితం చిన్నాభిన్నం అవుతోంది. ఎడతెగని వర్షాల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంభించింది. వందలాది ఏజెన్సీ వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. గ్రామాలను, ఇళ్లను నీరు ముంచెత్తుతుండటంతో ప్రజలు వరద నీటిలో ఉండలేక, సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో లెంకలగడ్డ గ్రామానికి చెందిన చెన్నూరి రజిత ప్రసవ వేదనతో బాధ పడుతూ వరదల్లో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగించింది.
Also Read : రైతుకు దూరంగా రైతువేదికలు….
ప్రసవ వేదనతో బాధ పడుతున్న నిండు గర్భిణిని హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో పెద్దంపేట వరద నీటితో ధ్వంసమైన బ్రిడ్జి వద్ద వాగు దాటలేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ బంధువులు అంబట్ పల్లి గ్రామ సర్పంచ్ విలాస్ రావు కు ఫోన్ ద్వారా వివరాలు తెలుపగా, వెంటనే స్పందించిన సర్పంచ్ బ్రిడ్జి వద్దకు చేరుకొని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వారి బస్ సాయంతో ఆమెను కాపాడి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న గర్భిణిని అంబట్ పల్లి గ్రామ సర్పంచ్ మరియూ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- ముసలోడు కాదు…. మృత్యుంజయుడు….
- సీఐ, ఎస్‌ఐల వ్యవహారంతో మసకబారిన పోలీసు ప్రతిష్ఠ.
- కెసిఆర్ సవాల్ కు సై అన్న బండి, ఉత్తమ్
- రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. అనుకున్నది అనుకున్నట్టే చేస్తున్నారా ?