
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : భూమి మీద బ్రతకాలని ఉంటే ముసలి వ్యక్తిని కూడా మృత్యువు ముట్టుకోదనే నానుడి నిజమైంది. ఏడు పదుల వయసులో బైక్‌పై వెళ్తున్నాడు ఓ పెద్దాయన. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.బైక్‌తో సహా వృద్ధుడు లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. అందరూ వృద్దుడు చనిపోయాడని డిసైడ్ అయ్యారు. కానీ, చిన్నచిన్న దెబ్బలు కూడా తగలకుండా ప్రాణాలతో బయట పడ్డాడు. ఇది చూసి స్థానికులే కాదు, వార్త తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Also Read : రైతుకు దూరంగా రైతువేదికలు….
లారీ కింద పడి బ్రతికిన వృద్ధుడు…
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం మసీదుగూడెం గ్రామానికి చెందిన విఘ్నేశాచారి సొంత పని మీద బైక్ వేసుకొని ఆదివారం మధ్యాహ్నం చౌటుప్పల్ వచ్చాడు. 73 సంవత్సరాల వయసు కలిగిన విఘ్నేశాచారి చౌటుప్పల్‌లోని అంగడిలో పని పూర్తి చేసుకొని స్వగ్రామానికి బైక్‌పై పయనమయ్యాడు. హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే రోడ్డుపై సరిగ్గా ఆర్టీసీ బస్టాండ్ ముందు బైక్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ విఘ్నేశాచారి బైక్‌ని ఢీకొట్టింది. ఊహించని విధంగా లారీ ఢీకొట్టడంతో బైక్‌తో పాటు వృద్ధుడు లారీ ముందు చక్రాల మధ్యలో చిక్కుకుపోయాడు. అంతా అతను మృతి ఉంటాడని భావించారు.
కానీ, వృద్ధుడు లారీ టైర్ల మధ్యలో బైక్‌తో సహా ఇరుక్కుపోవడం డ్రైవర్ గమనించలేదు. దాంతో లారీని ముందుకు పోనిస్తుండగా అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు, స్థానికులు గట్టిగా అరవడంతో వారి కేకలు విని డ్రైవర్ బ్రేక్ వేశాడు. డ్రైవర్ చాకచక్యంగా స్లోగా బ్రేక్ వేయడం వల్లే విఘ్నేశాచారి ప్రాణాలతో ఉన్నాడు. వెంటనే స్థానికులు పరుగులు పెట్టుకొని లారీ దగ్గరకు చేరుకున్నారు. లారీ టైర్ల మధ్యలో బైక్‌తో సహా చిక్కుకున్న వృద్ధుడ్ని సేఫ్‌గా బయటకు తీశారు.
Also Read : సీఐ, ఎస్‌ఐల వ్యవహారంతో మసకబారిన పోలీసు ప్రతిష్ఠ.
వైరల్ అవుతున్న వార్త….
ఈ ప్రమాదంలో వేరే వాళ్లు ఉండి ఉంటే కచ్చితంగా చనిపోయి ఉండేవాళ్లని స్థానికులు తెలిపారు. 73సంవత్సరాల విఘ్నేశాచారి కాలికి మాత్రమే చిన్న గాయమైంది. రోడ్డుపై ఊడ్చుకుపోవడంతో కాస్త డోక్కుపోయిందని ఎలాంటి దెబ్బలు తగల్లేదని అతనే స్వయంగా చెప్పడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వృద్ధుడి ప్రాణాలు పోకుండా స్థానికుల అరుపులు విని నిదానంగా బ్రేక్ వేసి లారీని కంట్రోల్ చేసిన డ్రైవర్‌ని స్థానికులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
- కెసిఆర్ సవాల్ కు సై అన్న బండి, ఉత్తమ్
- సిఐ నాగేశ్వరరావు కేసులో దర్యాప్తు ముమ్మరం…
- హక్కు దక్కదు… అప్పు పుట్టదు…
- రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. అనుకున్నది అనుకున్నట్టే చేస్తున్నారా ?
One Comment