
క్రైమ్ మిర్రర్ : భారత దేశంలో రాజకీయ నేతల దర్పం మాములుగా ఉండదు. అధికారులు వాళ్ల చుట్టూ తిరగాల్సిందే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రాజకీయ నేతలకు గులాం గిరి చేయాల్సిందే. లేదంటే ఏ మారుమూల ప్రాంతానికే బదిలీ కావాల్సిందే. తాజాగా ముఖ్యమంత్రికి చల్లారిపోయిన టీ ఇచ్చినందుకు ఓ ఉద్యోగికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖజురహోలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు చల్లారిపోయిన టీ ఇచ్చారన్నది ఉద్యోగిపై వచ్చిన ఆరోపణ. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఖజురహో వచ్చిన చౌహాన్ ఎయిర్ పోర్టు వద్ద కాసేపు ఆగారు. ఆ సమయంలో నాసిరకం టీ, పైగా చల్లారిపోయిన టీ ఇవ్వడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రాకేశ్ కనౌహా అనే జూనియర్ పౌర సరఫరాల అధికారిని బాధ్యుడ్ని చేశారు. అతడికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీఎంకు అలాంటి టీ ఎందుకు అందించారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు.
ఇవి కూడా చదవండి …
- ద్రౌపదీ ముర్ముతో టిడిపి ఆత్మీయ బేటి….
- మర్రిగూడ వైన్స్ లపై హెచ్ఆర్సిలో పిర్యాదు… నకిలీ మద్యం విక్రయం
- అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్…
- గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలుసా?
- చంద్రబాబు వ్యూహం ఫలించేనా… ఎన్డిఏ వైపు తొలి అడుగు..
2 Comments