
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : తెలంగాణ లో ఖాకీ కీచకులు బయటపడుతున్నారు. హైదరాబాద్, మారేడ్‌పల్లి సీఐ ఘటన మరవకముందే, కొమరంభీం జిల్లాలో మరో కీచక ఎస్ఐ బాగోతం బయటపడింది. పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతికి స్టడీ మెటీరియల్స్ ఇస్తానంటూ రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ గౌడ్ మొదట నమ్మించాడు.
ఆ తర్వాత లైంగికంగా వేధించాడు.పరిక్ష రాయకున్న ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ, స్టేషన్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఎత్తు, బరువు చూడాలంటూ ఆమెకు నరకం చూపించాడు. దీంతో ఆమె ఎదురుతిరగడంతో బెదిరించాడు. బంధువులకు బాధితురాలు జరిగిన విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కోట్లకు పడలేత్తిన సిఐ నాగేశ్వరరావు…. ప్రయివేటు సేనతో కలక్షన్లు..
- వరద నీటిలో..’గర్భిణి ప్రసవ వేదన’ స్పందించిన… సర్పంచ్
- ముసలోడు కాదు…. మృత్యుంజయుడు… భూమి మీద బ్రతకాలని
- కూసుకుంట్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నేతలు…
One Comment