
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రకరకాల దందాలు.. సెటిల్మెంట్లతో కోట్లాది రూపాయల అక్రమార్జన! ఆ కలెక్షన్ల కోసం ఏకంగా ఇద్దరు, ముగ్గురు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకునే స్థాయి!! వచ్చిన డబ్బంతా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టడం.. నేరగాళ్లతో చెట్టాపట్టాల్!! ..అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై అరెస్టు అయిన ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు దురాగతాలపై రాచకొండ పోలీసులు తవ్వినకొద్దీ ఇలా నివ్వెరపోయే విషయాలెన్నో వెలుగుచూస్తున్నట్టు సమాచారం. 2004 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సైబరాబాద్‌కు బదిలీ అయ్యి.. అక్కడి నుంచి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో చేరినట్లు తెలిసింది. సర్వీస్ అంతా వెస్ట్, నార్త్‌జోన్‌లలో పని చేసిన అతడు.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరువయ్యేందుకు, ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించేవాడని తోటి అధికారులు చెబుతున్నారు.
Also Read : రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. అనుకున్నది అనుకున్నట్టే చేస్తున్నారా ?
గతంలో ఎస్సైగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన అనుభవమున్న నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌పైనే మక్కువ పెంచుకున్నాడని.. సైబరాబాద్‌కు బదిలీ అయినా, అక్కడికి వెళ్లకుండా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ అయి సుమారు ఐదేళ్ల పాటు పని చేసి అన్ని ప్రాంతాల్లో తిరుగులేని పట్టు సంపాదించుకున్నాడని విశ్వసనీయ సమాచారం. డ్రగ్స్, బెట్టింగ్, అంతరాష్ట్ర గ్యాంగుల్లాంటి పెద్ద కేసుల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా ఉన్నతాధికారులకు చేరువయ్యాడని.. తోటి అధికారుల ఇలాకాలను సైతం తన ఇలాకాగా మార్చుకునేవాడని, నగరంలో భారీగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని… దాన్నే తన దందాకు ఉనయోగించుకున్నాడని, టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నప్పుడు ఎన్నో సెటిల్‌మెంట్లు చేశాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆయనబాధితులు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు ఆధారాల్లేవనే సాకుతో వాటిని పట్టించుకోలేదని చెబుతున్నారు.
Also Read : కెసిఆర్ సవాల్ కు సై అన్న బండి, ఉత్తమ్
చెట్టాపట్టాల్..
నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నప్పుడు పలు సెటిల్మెంట్లకు సంబంధించి వసూళ్ల నిమిత్తం ఇద్దరు ముగ్గురు ప్రైవేట్ ఏజెంట్లను కూడా నియమించుకున్నట్లు తెలిసింది. అలాగే.. నార్త్‌జోన్‌లోని ఓ రౌడీ షీటర్‌తో నాగేశ్వరరావు సాన్నిహిత్యం గురించి కూడా ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్ దందా చేసే వారితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగి భారీగా కూడబెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండేళ్ల క్రితం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్‌లో ఓ పండగ వేళ జరిగిన టాస్క్‌ఫోర్స్ దాడుల్లో జూదమాడుతూ పలువురు ప్రముఖులు చిక్కగా… ఆ వ్యవహారాన్ని కూడా ఆయన డీల్ చేశారని, ఆ సమయంలో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారిందని.. తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి ఉన్నతాధికారులకు తెలియదా.? లేక తెలిసినా పట్టించుకోలేదా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
Also Read : కూసుకుంట్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నేతలు…
అధికార దుర్వినియోగం….
సెల్‌ఫోన్ లొకేషన్స్ చూడటంలో నాగేశ్వరరావు దిట్ట అని తోటి అధికారులు చెబుతున్నారు. అయితే.. విధినిర్వహణలో ఉపయోగించుకోవాల్సిన ఆ పరిజ్ఞానాన్ని ఆయన తన దందాలకు, సెటిల్‌మెంట్లకు, నేరాలకు ఉపయోగించారని సమాచారం. ఈ సమాచారం కోసం ఆయన పలు సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల ప్రతినిధులకు కూడా పనులు చేసి పెట్టినట్లు ఆరోపణలున్నాయి. నాగేశ్వరరావుపై వస్తున్న ఆరోపణల నేపద్యంలో…. ఇంకా ఆయన భాదితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- వరద నీటిలో..’గర్భిణి ప్రసవ వేదన’ స్పందించిన… సర్పంచ్
- ముసలోడు కాదు…. మృత్యుంజయుడు… భూమి మీద బ్రతకాలని
- సీఐ, ఎస్‌ఐల వ్యవహారంతో మసకబారిన పోలీసు ప్రతిష్ఠ.
One Comment