
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అక్రమాలకు హద్దే లేకుండా పోతోందా? అధికార మదంతో ఆయన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారా? అధికారులను తన చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారా? తాను చెప్పినట్లు వినకపోతే అంతు చూస్తానంటూ అధికారులను బెదిరిస్తున్నారా? అంటే నియోజకవర్గ ప్రజల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎమ్మెల్యేగా ఐదేళ్లు నియోజకవర్గంలో ఇష్టారాజ్యాంగా వ్యవరించిన కూసుకుంట్ల… ఎమ్మెల్యేగా ఓడిపోయినా టీఆర్ఎస్ సర్కారే ఉండటంతో సూడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తనకు నచ్చిన వాళ్లను అధికారులుగా నియమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనాలు చెబుతున్నారు.
Read More : కూసుకుంట్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీఆర్ఎస్ నేతలు…
తాజాగా మునుగోడు మండలంలో దేవాలయ భూ వివాదంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ భూములను కాపాడాల్సింది పోయి .. ఆ భూములకు కబ్జా చేసిన వ్యక్తులకు వంతపడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ భూముల వివాదంలోనే సొంత పార్టీ నేతలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఏకంగా ఆయన దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అయితే దేవాదాయ భూములపై రాజకీయ రచ్చ సాగుతుండగా… ఇందులోకి మునుగోడు తహశీల్దార్ ఎంటరయ్యారు. భూముల వివాదంలో కూసుకుంట్లకు సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు. చీకటిమామిడి భూముల విషయంలో ఏనాడు తలదూర్చలేదంటూ కూసుకుంట్లకు క్లీన్ చిట్ ఇచ్చేశారు మునుగోడు తహశీల్దార్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Also Read : హక్కు దక్కదు… అప్పు పుట్టదు…
దేవాదాయ భూములకు సంబంధించి తహశీల్దార్ ను ఎవరూ వివరణ అడగలేదు. కాని ఆయన స్వయంగా వివరణ ఇస్తూ కూసుకుంట్లకు సంబంధం లేదని చెప్పడంపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే తహశీల్దార్ వివరణ ఇచ్చారంటున్నారు. తనకు సంబంధం లేదని చెప్పాలని తహశీల్దార్ ను కూసుకుంట్ల బెదిరించి ఉంటారని చెబుతున్నారు. దేవాదాయ భూములకు సంబంధించి వివాదమే లేకుంటే తహశీల్దార్ వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్యే తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కూసుకుంట్ల చెబుతున్నారు. రాజకీయ వివాదం అయితే తహశీల్దార్ ఎందుకు వివరణ ఇచ్చారని స్థానికులు మండిపడుతున్నారు.
Read More : కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
చీకటిమామిడిలోని రామాలయం దేవాలయ భూమినీ కొందరు అక్రమంగా కబ్జా చేసి వినియోగించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్రీడా మైదానం కోసం దానిని గుర్తించి కబ్జాదారులను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కూసుకుంట్ల జోక్యం చేసుకుని కబ్జాదారులకు అండగా నిలిచారని చెబుతున్నారు. రెవిన్యూ అధికారుల ఆదేశాలకు కూసుకుంట్ల అడ్డుపడుతూ కబ్జాదారులకు కొమ్ముకాస్తూ వారిని దేవాలయ భూమి నుంచి ఖాళీ చేయించవద్దని హుకుం జారీ చేశారు.దీంతో ఆ గ్రామంలోని టిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్లపై తిరగబడ్డారు. దేవాలయ భూమినీ ఎలా కబ్జా చేయిస్తారంటూ ఫైరయ్యారు. కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారంటూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ కార్యకర్తలే దగ్దం చేశారు.
ఇవి కూడా చదవండి …
- ముఖ్యమంత్రికి చల్లారిపోయిన టీ.. ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్
- బ్రేకింగ్: గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలుసా?
- చంద్రబాబు వ్యూహం ఫలించేనా… ఎన్డిఏ వైపు తొలి అడుగు..
- కీచక ఎస్ఐ అరాచకాలు… స్టడీ మేటిరియల్ ఇస్తానంటు యువత
- కోట్లకు పడలేత్తిన సిఐ నాగేశ్వరరావు…. ప్రయివేటు సేనతో కలక్షన్లు..
One Comment