
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వారి చేతిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉంది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. కానీ ఐదేళ్ళుగా ఆభూములపై హక్కులు లేక, రుణాలు పొందలేక, రైతుబందు అందుకోలేక ఇబ్భందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఎసైన్డ్, ఇనాం భూముల లబ్దిదారుల పరిస్థితి ఇది. ఈ భూముల్లో ప్రస్తుతం వానాకాలం పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అప్పు పుట్టక ఆయా రైతులు అవస్థలు పడుతున్నారు. 2017 సెప్టెంబర్ ముందు వరకు ఈభుములకు పాత పట్టపుస్తకలు ఉన్నాయి. భుదస్త్రాల ప్రక్షాళన అనంతరం రెవెన్యూశాఖ వీటిలో చాలా భూములకు కొత్త పట్టపుస్తకలు జారిచేయలేదు. భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీంతో వీరికి సమస్యలు మొదలయ్యాయి.
Also Read : రైతుకు దూరంగా రైతువేదికలు….
ఈభూములు….ప్రభుత్వం పేదలకు కేటాయించినవి కావడంతో చాలా జిల్లాల్లో రెవిన్యు యంత్రాంగం కొత్తపుస్తకలు జారి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇనాం భూములకు అధీన హక్కు పత్రం(ఓఆర్సి) జారిచేసిన చోట కూడా నేటికి కొత్త పాసుపుస్తకాలు అందలేదు. కొన్ని జిల్లాల్లో ఇనాం భూముల లబ్దిదారుల ఖాతాలను రెవెన్యూ రికార్డుల నుండి పూర్తిగా తొలగించారు. పాసుపుస్తకలు అందని రైతులు ధరణి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని రేవేన్యుశాఖ ప్రకటించిన ప్రతిసారి వేల మంది రైతులు మిసేవా కేంద్రాలకు ఎంతో ఆశతో వస్తున్నారు. ఈ భూముల సర్వే నెంబర్, ఖాతా నెంబర్ సైతం ఆన్లైన్లో లేకపోవడంతో వారి దరఖాస్తులను పోర్టల్ స్వీకరించడం లేదు. దీంతో విసిగిపోతున్న భాదితులు కుటుంబ అవసరాల కోసం దిక్కులేని పరిస్థితులలో భూములను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఈవిధంగా పలు జిల్లాలలో కొన్ని వందల ఎకరాలు చేతులు మారింది. బహిరంగ మార్కెట్లో ఎకరా ధర 20 లక్షలు ఉండగా… ఈ భూములు 3 లక్షల విలువ కూడా చేయడంలేదు. 2018 నాటికీ రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూమి చేతులు మారినట్లు అధికారిక సమాచారం. కొత్త పాసుపుస్తకలు అందక గడిచిన నాలుగు సంవత్సరాలలో పెద్ద ఎత్తున పేదలు భూములను విక్రయించారని తెలుస్తుంది.
Read Also : రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. అనుకున్నది అనుకున్నట్టే చేస్తున్నారా ?
ప్రభుత్వం కొత్త పాసుపుస్తకలు జారీచేసే వరకు ఎసైన్డ్ భూముల లబ్దిదారులు, వారి తరువాత వారసత్వంగా హక్కులు పొందిన వారి వివరాలను ఆన్లైన్ లో, ధరణి పోర్టల్ లో ప్రత్యెక విండోను చేర్చాలని విజ్ఞ్యప్తులు వస్తున్నాయి. దీనివలన హక్కుదారులు ప్రైవేటుగానైన అప్పులు తీసుకునెందుకు వీలవుతుందని చెప్తున్నారు. ధరణి పోర్టల్ కు ముందు వెబ్ ల్యాండ్ వెబ్ సైట్లో ఇదే తీరుగా హక్కుదారుల వివరాలు ఉండేవని గుర్తు చేస్తున్నారు. అనేక జిల్లాలలో ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల్లో ఇలాంటి విజ్ఞ్యప్తులే అధికంగా రావడం విశేషం..
ఇవి కూడా చదవండి :