
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులంటే గొప్ప పేరు ఉంది. అంతర్జాతీయ నేరస్థులు, ఉగ్రవాదులు, కరడుగట్టిన దొంగల ముఠాను కట్టడి చేయడంలో హైదరాబాద్ పోలీసులకు ఉన్న గుర్తింపే వేరు. కానీ.. కొందరు పోలీసుల తీరుతో ఆ శాఖ అప్రతిష్ఠ పాలవుతోంది. నాగేశ్వరరావు వంటి కొందరు అధికారుల తీరు మచ్చ తెచ్చిపెడుతోంది. మూడు కమిషనరేట్‌ల పరిధిలో ఈ ఏడాది సుమారు నలుగురు ఏసీపీలు, పది మంది ఇన్‌స్పెక్టర్లతోపాటు 33 మంది ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. కమీషన్‌లపై ఆశతో సివిల్ తగాదాలో తలదూర్చడం, మహిళల బలహీనతలను, అవసరాలను ఆసరాగా తీసుకుంటూ పలు వివాదాల్లో తలదూరుస్తున్నారు.
Also Read : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
తాజాగా మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు, మల్కాజిగిరి సీసీఎస్ ఎస్‌ఐ విజయ్‌రావత్‌లు మహిళలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకుని సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి మరకలు, అఘాయిత్య వివాదాల్లో పోలీస్ అధికారులే నిందితులుగా రికార్డుల్లోకి ఎక్కడం కలకలం రేపుతోంది. పోలీసు ప్రతిష్ఠతోపాటు, విధి నిర్వహణలో బాధ్యతగా ఉంటున్న వారికి కూడా మకిలి అంటుకుంటుండటం ఆ శాఖను కలవరపాటుకు గురిచేస్తోంది. కానిస్టేబుల్ వరకు పరిమితమైన ఆరోపణలు ఇప్పుడు ఉన్నతాధికారుల వరకు పాకడంతో ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు.
Also Read : కెసిఆర్ సవాల్ కు సై అన్న బండి, ఉత్తమ్
పోలీసులపై చిన్న ఆరోపణ వచ్చినా అది కలకలం రేపుతుంది. పైగా అఘాయిత్యాల ఆరోపణలు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా అనేక ఠాణాల్లో సీఐలు, ఎస్‌ఐల పనితీరుపై ఆరోపణలు ఎదురయ్యాయి. ఒత్తిడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తూ వచ్చారు. సీఐ నాగేశ్వరరావు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయనపై అవినీతి ఆరోపణలు గతంలోనే అనేకం వెలుగులోకి వచ్చాయి. అతని నేరపరిశోధనలో ఉన్న చాతుర్యం కారణంగా ఉన్నతాధికారులు హెచ్చరికలతో సరిపెట్టి వదిలేశారు. ఉన్నతాధికారులు తమ సొంత పనుల కోసం అతన్ని ఎక్కువగా ఉపయోగించేవారని సమాచారం. అందుకు అతను కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ లభిస్తుందని పోలీసు శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చొరవతోనే మూడు నెలల క్రితం బంజారాహిల్స్‌లో పోస్టింగ్ లభించిందని తెలుస్తోంది. అంతేకాదు అనేక మంది ఎస్‌ఐలపై కూడా అవినీతి ఆరోపణలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చివరకు ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఎస్‌ఐలు కూడా తమ సెక్టార్లలో సెటిల్‌మెంట్‌లలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
Also Read : సిఐ నాగేశ్వరరావు కేసులో దర్యాప్తు ముమ్మరం…
నాగేశ్వరరావు బంజారాహిల్స్ బదిలీ అయ్యాక కూడా ఆరోపణలు మాత్రం తగ్గలేదు. బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు జరిగిన సమయంలో ఆయనకు బంజారాహిల్స్ ఠాణాకు పోస్టింగ్ లభించింది. స్థానిక పోలీసులకు, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న నాగేశ్వరరావు స్వయంగా పబ్‌పై దాడులు నిర్వహించారు. ఇది జరిగిన 12 గంటల్లోనే ఆయనకు పోస్టింగ్ లభించడం అప్పటి సీఐ శివచంద్ర సస్పెండ్ కావడం పెద్ద వివాదానికి దారితీసింది. పోస్టింగ్ కోసమే పబ్‌పై నాగేశ్వరరావు దాడులు నిర్వహించారని ప్రచారం జరిగింది.
Read More : కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం…
ఇది జరిగిన 10 రోజులకే బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లోని ఓ స్థలం వివాదంలో కర్నూలుకు జిల్లాకు చెందిన సుమారు 60 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి కోసం పోలీసులు ఓ నిర్మాణ దారుడికి కొమ్ముకాశారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన రాజ్యసభ సభ్యుడి పేరు తొలగించేందుకు భారీగా డబ్బులు చేతులు మారాయని సమాచారం. ఇక శ్రీనగర్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట శిబిరంపై చేసిన దాడుల్లో ఇద్దరు ఏసీపీలు కూడా పేకాటాడుతూ దొరికారని, వారిని పోలీసులు పథకం ప్రకారం తప్పించారని తెలిసింది.
ప్రభుత్వ విధుల్లో ఉండగా అవినీతి ఆరోపణలు రావడం, సస్పెండ్ కావడం, ఏసీబీ దాడులు జరగడం వంటివి తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పరిస్థితి ఎలాగున్నా అతని కుటుంబ సభ్యులు మాత్రం తెలియని ఒత్తిడికి గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో బీజేపీ ప్లాన్?
- హక్కు దక్కదు… అప్పు పుట్టదు…
- రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్.. అనుకున్నది అనుకున్నట్టే చేస్తున్నారా ?
- రైతుకు దూరంగా రైతువేదికలు….
- ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
2 Comments