
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం సమ్మునతాశయంతో నిర్మించిన రైతువేదికలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. అన్నదాతల అభివృధికి తోడ్పడేలా వీటిని రూపొందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పలు మార్లు సూచించిన కింది స్థాయి అధికారులు కొందరు వీటిగురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామాలలో రైతువేదికలను 570 కోట్ల రూపాయలతో వ్యవసాయశాఖ వీటిని నిర్మించింది. ముఖ్యమంత్రి సహా కొందరు నేతలు విరాళాలు ఇచ్చి వారి గ్రామాలలో వీటి నిర్మాణానికి చేయుతనిచ్చిన వాటి వినియోగం గురించి క్షేత్రస్థాయి అధికారులకు శ్రద్ధ లేకుండా పోయింది. ఒక్కోదానికి 22 లక్షల రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా…రైతువేదికల నిర్వహణకు డబ్బులులేక వినియోగించడం లేదు. రాష్ట్రములోని పలు చోట్ల ధాన్యం బస్తాల నిల్వలకు రైతువేదికలను వాడుతుండటంతో రైతులు వచ్చిన కూర్చోవడానికి చోటు లేకుండా తయారయ్యాయి. చాలాచోట్ల నిటి సదుపాయం లేదు. మిషన్ భగీరధ పైపులైన్ల ద్వారా నిటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం చెప్పిన కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ సొంత డబ్బులతో మంచి నిరు కొనాల్సి వస్తుందని గ్రామ విస్తరణ అధికారులు వాపోతున్నారు.
Also Read : డేట్ చెప్పండి.. అసెంబ్లీ రద్దు చేస్తా.. విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్..
కొన్ని రైతువేదికలకు విద్యుత్ సౌకర్యం లేదు. నిర్మాణం అనంతరం రాష్ట్ర రాజధిని నుండి నేరుగా విడియో కాన్ఫరెన్సు ద్వారా సిఎం లేదా మంత్రులు, అధికారులు రైతువేదికలో రైతులతో మాట్లాడే సదుపాయం ఉంటుందని తొలత చెప్పారు. కానీ టివిలు ఏర్పాటు చేయకపోవడంతో విడియో కాన్ఫరెన్సు లేకుండా పోయింది. ప్రతి రైతువేదికకు నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టినా నిధుల విడుదల మాత్రం జరగడం లేదు. రైతువేదికలకు వాచ్మెన్ లేకపోవడంతో ఎఈవో గ్రామాలకు వెళ్తే అక్కడకు వచ్చే రైతులకు సమాధానం చెప్పేవారు కరువవుతున్నారు. ఒక్కో వేదికలో 12 ఫ్యాన్లు పెట్టాలని తొలత ప్రణాళికలో తెలిపారు. చాల చోట్ల ఆరేడు కూడా ఏర్పాటు చేయలేదు. చాలాచోట్ల మరుగుదొడ్ల పేరుతో గోడలు మాత్రమే నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. కొన్ని చోట్ల రైతువేదికలు గ్రామాలకు దూరంగా నిర్మించడంతో రైతులు రాలేకపోతున్నారు.
Also Read : ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో బీజేపీ ప్లాన్?
పంటల సాగులో కొత్త పద్దతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతువేదికల వద్ద అవగాహనా సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి. రైతుబందు సమితుల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు రైతులతో చర్చించాలి. అసలు రాష్ట్రంలో రైతుబందు సమితి కార్యకలాపాలే లేవు. కొత్త పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయడంలేదు. రైతుబందు, రైతుభిమా సోమ్ములకు దరఖాస్తులు, ఫిర్యాదుల స్వికరనతోనే సరిపోతుందని, మిగితా కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు తామే సొంత సొమ్ము వేత్తవలసి వస్తుందని ఎమి చేయలేకపోతున్నామని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన రైతువేదికలలో కనీస సౌకర్యాలు కల్పించి రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రైతాంగం కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ పోలిసులకు కొత్త మాన్యువల్ !!!
- బీజేపీ సంచలనం.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ
- కిచక సీఐ నాగేశ్వరరావుకి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు!
- తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవు
6 Comments