
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే రేవంత్ రెడ్డి తనదైన ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని.. ఈ విషయంలో ఆయన పార్టీలోని తన ప్రత్యర్థులుగా చెప్పుకునే వారిని పట్టించుకోనే అవకాశం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇతర పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేలా ప్రొత్సహిస్తోంది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చేరికల విషయంలో ఎవరెన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేసినా.. రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఏడాదికాలం పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోని అనేక మంది సీనియర్లతో సఖ్యత లేకుండానే ముందుకు సాగుతున్నారనే చర్చ జరుగుతోంది.
Also Read : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని.. సీనియర్లను లెక్క చేయడం లేదనే ఫిర్యాదులు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా కొన్నిసార్లు రేవంత్ రెడ్డితో చర్చించింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ బలోపేతం కోసం తన మదిలో ఉన్న బ్లూ ప్రింట్‌ను అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నారని.. అదే చేస్తున్నారని కొందరు చర్చించుకుంటున్నారు. నిజానికి టీటీడీపీలో ఉన్న సమయంలో అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి వెంట నడించారు. వారంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో ఆయన వెంట రాలేదుఅయితే గతంలో తనతో కలిసి పని చేసిన నేతలు.. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
Read More : కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
ఈ క్రమంలోనే అనేక మంది నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎర్ర శేఖర్, బిల్యా నాయక్ వంటి నేతలు కూడా గతంలో టీడీపీలో పని చేసిన వాళ్లే. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో సొంతంగా తనకంటూ ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. తాను తీసుకొస్తున్న నేతలకు టికెట్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. నిజమైన కాంగ్రెస్ నేతలను ఆయన పక్కనపెడుతున్నారనే ఆరోపణలు పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్నా.. ఆయన మాత్రం ఈ విషయంలో ఎవరినీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.అయితే రాబోయే రోజుల్లోనూ రేవంత్ రెడ్డి ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగే అవకాశం ఉందని.. ఆయన టీమ్‌గా చెప్పుకునే మరికొందరు నేతలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లోకి వస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే రేవంత్ రెడ్డి తనదైన ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారని.. ఈ విషయంలో ఆయన పార్టీలోని తన ప్రత్యర్థులుగా చెప్పుకునే వారిని పట్టించుకోనే అవకాశం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి …
- డేట్ చెప్పండి.. అసెంబ్లీ రద్దు చేస్తా.. విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్..
- కిచక సీఐ నాగేశ్వరరావుకి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు!
- తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవు
- విజయమ్మ సొంతంగానే తప్పుకున్నారా.. బెదిరించి తప్పించారా?
- వివేకాను చంపింది వారిద్దరే.. సీబీఐ రిపోర్టులో కీలక ఆధారాలు..
4 Comments