
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు మరింత ముదిరింది. ఏకంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేసుకునే వరకు వెళ్లింది. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మాజీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకత పెరిగింది. టీఆర్ఎస్ నేతలు ఆయన విభేదించి బయటికి వస్తున్నారు. టీఆర్ఎస్ లోనే మరో నలుగురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. కూసుకుంట్లకు పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో కూసుకుంట్ల వ్యతిరేకులంతా వాళ్ల గూటికి చేరారు. దీంతో తనను వ్యతిరేకంగా ఉన్న నేతలపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంత కాలంకా మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ఆగడాలు మితిమీరిపోయాయని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఓపెన్ గానే చెబుతున్నారు. తాజాగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను ఆయన పార్టీ నేతలే దగ్ధం చేయడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.
Also Read : కూసుకుంట్లను తరిమికొడతామంటున్న జనం.. అసలేం జరిగింది?
మునుగోడు మండలంలోని చీకటి మోడీ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆ గ్రామంలోని రామాలయం దేవాలయ భూమినీ కొందరు అక్రమంగా కబ్జా చేసి వినియోగించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్రీడా మైదానం కోసం దానిని గుర్తించి కబ్జాదారులను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కూసుకుంట్ల జోక్యం చేసుకుని కబ్జాదారులకు అండగా నిలిచారని చెబుతున్నారు. రెవిన్యూ అధికారుల ఆదేశాలకు కూసుకుంట్ల అడ్డుపడుతూ కబ్జాదారులకు కొమ్ముకాస్తూ వారిని దేవాలయ భూమి నుంచి ఖాళీ చేయించవద్దని హుకుం జారీ చేశారు.
Read More : కూసుకుంట్ల అండతో అనుచరుల అక్రమాలు.. ప్రశ్నించిన సొంత పార్టీ సర్పంచ్ పైనే కేసు!
దీంతో ఆ గ్రామంలోని టిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్లపై తిరగబడ్డారు. దేవాలయ భూమినీ ఎలా కబ్జా చేయిస్తారంటూ ఫైరయ్యారు. కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారంటూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ కార్యకర్తలే దగ్దం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ తన బుద్ది మార్చుకోకుండా అధికార పార్టీలో ఉన్నాననే అహంకారంతో నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తాను ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు అతనిపై విసిగెత్తి ఇలా రోడ్డెక్కుతున్నారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- సీఐ, ఎస్‌ఐల వ్యవహారంతో మసకబారిన పోలీసు ప్రతిష్ఠ…
- హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
- కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
- అయితే టీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్! మునుగోడులో కంచర్ల పోటీ ఖాయమే?
One Comment