
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విపక్షాలకు సవాల్ చేశారు. ధమ్ముండే ఎన్నికలకు తేది ఖరారు చేయాలని అన్నారు. డేట్ చెప్పండి.. నేను అసెంబ్లీ రద్దు చేస్తా అంటూ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో తేల్చుకుందాం దమ్ముంటే రావాలని విపక్షాలకు సవాల్ చేశారు సీఎం కేసీఆర్. ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. తమను ఎవరూ ఓడించలేరన్నారు కేసీఆర్.
Read More : ఒకే దెబ్బకు అటు కేసీఆర్.. ఇటు రేవంత్ రెడ్డి! ఈటలతో బీజేపీ ప్లాన్?
వారసత్వ రాజకీయాలపైనా ఆయన సంచలన కామెంట్లు చేశారు. జర్నలిస్ట్ కొడుకు జర్నలిస్ట్ అయితే వారసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. ఒక్కసారి మాత్రమే కుటుంబ పరపతి కలిసివస్తుందని.. సరిగా పనిచేయకపోతే తర్వాత ఎన్నికల్లో ప్రజలే దూరం కొడతారని కేసీఆర్ అన్నారు. కుటుంబ పాలన అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు కేసీఆర్. మోడీకి దమ్ము ఉంటే తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో ఏనాథ్ షిండే ను తీసుకురావాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి పై తనకు తృప్తి ఉందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని టాప్ స్థాయిలో ఉంచిన తాను ఎవరికి బయపడబోనని చెప్పారు. తనకు మనీ లేదు, లాండరింగ్ లేదన్న కేసీఆర్.. తమతో తో గోక్కుంటే అగ్గితో గోక్కున్నట్లే జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి…
- కిచక సీఐ నాగేశ్వరరావుకి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు!
- తెలంగాణలో స్కూళ్లకు మూడు రోజులు సెలవు
- తెలంగాణ పోలిసులకు కొత్త మాన్యువల్ !!!
- మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి… ఇప్పుడు లాడ్జిలో అడ్డంగా దొరికాడు!
- భయాందోళనలు రేపుతున్న విద్యుత్ వాహనాల ప్రమాదాలు…
One Comment