
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వనస్థలిపురంలో అర్ధరాత్రి మహిళ ఇంటికి వెళ్లి… ఆమెను తుపాకీతో బెదిరింది అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఘటన జరిగి రెండు రోజులైనా ఇంకా నాగేశ్వరరావును పోలీసులు పట్టుకోలేదు. ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరాయ్యాడు. తనపై ఫిర్యాదు వచ్చిన రోజున నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అయితే తాను నైట్ డ్యూటీలో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని.. ఉదయం వస్తానని పోలీసులు చెప్పి… ఆ మేరకు లేఖ రాసి వెళ్లాడు. అర్ధరాత్రి 12 తర్వాత మొబైల్ స్విచాఫ్ చేసుకుని పరారయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసు నమోదైనా ఎందుకు అదుపులోనికి తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
Read More : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
సీఐ నాగేశ్వరరావు విషయంలో రాజకీయ రచ్చ సాగుతోంది. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. కీచక సీఐని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఐ నాగేశ్వరరావు కీలకపర్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళను తుపాకీతో బెదిరింది రేప్ చేసిన సీఐ నాగేశ్వరరావుకి సీఎం కేసీఆర్ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్లు చేశారు. బంజారాహిల్స్ రాడిసన్ డ్రగ్స్ దందా కేసు వివరాలన్ని నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాయన్నారు. యువరాజు చిట్టా కూడా అందులోనే ఉందన్నారు రేవంత్ రెడ్డి. అత్యాచారం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.బాధిత మహిళపై వ్యభిచారం కేసు పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. బాధిత మహిళ భర్తపై బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి …
- కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం…
- ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు… రైతుల పాలిట శాపాలు
- 16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు… తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- తెలంగాణాలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
One Comment