
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య 16కి పెరిగింది. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. రాత్రి కూడా సహాయచర్యలు కొనసాగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, SDRF, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. అమర్నాథ్ గుహ దిగువన సంభవించిన ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆకస్మిక వరదల్లో 25 టెంట్లు కొట్టుకుపోయాయి. దాదాపు 40 మందికిపైగా వరదల్లో కొట్టుకుపోయారని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
Read More : ఉగ్రవాద సంస్థతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు లింకులు
అమర్నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల నుంచి గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ కుటుంబసభ్యులతో కలిసి అమర్ నాథ్ వెళ్లారు. భోలేనాథ్ దర్శనం అనంతరం తిరుగుపయనమయ్యారు. అంతలోనే భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. అప్పటికే రాజాసింగ్ టీమ్ సురక్షిత ప్రాంతంలో ఉంది. ఆకస్మిక వరదలతో టెంట్లు కొట్టుకుపోయిన భక్తులు వరదలో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని రాజాసింగ్ దాటిపోయిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. వరదలు వచ్చిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో రాజాసింగ్ ఉండగా ఈ ఘటన జరిగింది. వరదలకు సంబంధించిన వివరాలను రాజాసింగ్ ఫోన్ ద్వారా తెలుగు మీడియాకు అందించారు. వరదలతో పలు టెంట్లు కొట్టుకుపోయాయని, 40 మంది వరకు వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు.
Read More : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో వరద వచ్చిందన్నారు. భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. మాకు కొంత దూరంలోనే వరద ప్రవాహంలో ఎంతోమంది కొట్టుకుపోవడం చూశానని రాజాసింగ్ చెప్పారు. తాము కూడా ప్రాణాలతో బయటపడతామో లేదో అని భయపడ్డామని తెలిపారు. సమయానికి గుర్రాలు దొరికడంతో తిరిగొచ్చామని తెలిపారు. మూడు గంటల తర్వాత కిందకు వచ్చామని చెప్పారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయం తెలుసుకొని అక్కడి పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో తమ కుటుంబ సభ్యులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారని రాజాసింగ్ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. నీరు, ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తనతో పాటు ఉన్న బృందం సురక్షితంగానే ఉందన్నారు. వరదలు వచ్చిన ప్రాంతంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వందలాది మంది యాత్రికులు అమర్నాథ్ లోనే ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి …
- ముంత కాబ్ ముఠా నేత అల్లుడే… ఆయన కనుసన్నల్లోనే 250 మంది ఏజెంట్లు
- కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
- వైయస్సార్ సిపి క్యాడర్ లో అసంతృప్తులు
- సీఎం జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారు.. మంత్రి కామెంట్లతో కలకలం..
- చట్ట వ్యతిరేక చర్యలపై పోలీసుల కొరడా..!
One Comment