
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : శ్రీలంక మళ్లీ రణరంగమైంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నెల క్రితం వరకు తీవ్ర ఆందోళనలు జరిగాయి. నిరసనలు హోరెత్తడంతో ప్రధానమంత్రి పదవికి మహేంద్ర రాజపక్స రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిరసనలు తగ్గాయి. అయితే తాజాగా మళ్లీ శ్రీలంకలో నిరసనలు హోరెత్తాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్ష పదవీకి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొలంబోలోని అధ్యక్షుడి అధికారిక నివాసం ముందు వేలాది మంది ఆందోళనకు దిగారు. ప్రెసిడెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
Read More : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
నిరసనకారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో భయంతో గొటబయ రాజపక్స అధికారిక నివాసం వదిలి పారిపోయారు. అయితే ఆర్మీ వర్గాలు మాత్రం రాజపక్స పారిపోలేదని.. నిరసనకారులు లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో ముందు జాగ్రత్తగా తామే ఆర్మీ హెడ్‌క్వాటర్స్‌కు తరలించామని తెలిపాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించడంతో శుక్రవారం రాత్రే రాజపక్సను అధ్యక్ష భవనం నుంచి ఆర్మీ కార్యాలయానికి తరలించినట్టు శ్రీలంక రక్షణ శాఖ వెల్లడించింది.భద్రత దృష్ట్యా అధ్యక్షుడు గొటబయకు ఎస్కార్ట్ కల్పించామని తెలిపింది. ఇక శ్రీలంక అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్న ఆందోళనకారుల సంఖ్య పెరుగుతుండడంతో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి.
ఇవి కూడా చదవండి …
- మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి… ఇప్పుడు లాడ్జిలో అడ్డంగా దొరికాడు!
- ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు… రైతుల పాలిట శాపాలు
- 16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు… తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
- టిడిపి కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టను.. చంద్రబాబు
One Comment