Telangana

మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి… ఇప్పుడు లాడ్జిలో అడ్డంగా దొరికాడు!

ఈ సిఐ మాములోడు కాదుగా...

క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : అది వనస్థలిపురం పోలీస్ స్టేషన్. వర్షంలో తడుస్తూనే ఓ వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చాడు. అతనిలో ఆవేశం కనిపిస్తోంది. ఆవేదన, ఆక్రోశం కూడా ఉంది. అతని పరిస్థితి చూసి రిసెప్షన్‌లో పోలీస్ కుర్చీలో కుర్చీబెట్టి వివరాలు కనుక్కున్నారు. ఆయన చెప్పిన వివరాలు విని ఆ రిసెప్షన్లో ఉన్న పోలీసుకు చెమటలు పట్టలేదు కానీ.. క్లిష్టమైన కేసే అనిపించింది. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు క్షణం ఆలోచించలేదు. అతని చెప్పిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడమే కాకుండా తక్షణం అతన్ని తీసుకుని బయలుదేరారు.

Also Read : బీజేపీ సంచలనం.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ

ఇతర వ్యక్తి భార్యతో లాడ్జిలో ఉండగా దొరికిన సీఐ నాగేశ్వరరావు!
వనస్థలిపురం పరిధిలోని ఓ లాడ్జీకి వెళ్లారు. ఓ గది తలుపు కొట్టి అందులో ఉన్న ఓ ఆడ, మగ జంటలో మగ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. వారు భార్యభర్తలు కాదు. కానీ వారు వ్యభిచారం చేయడం లేదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నారు. అయినా ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ మహిళ భర్త ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా అయితే ఈ కేసు గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ అక్కడ లాడ్జిలో దొరికిన వ్యక్తి ప్రముఖుడు కావడంతోనే ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది. అతను ఎవరంటే పోలీసు అధికారే. మారేడ్ పల్లి సీఐగా ఉన్నారు. ఆయన పేరు నాగేశ్వరరావు.

Also Read : నడి రోడ్డుపై పట్ట పగలు కత్తులతో దాడి..!!

బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును విచారించిన సీఐ..
ఇటీవల బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసులో అప్పట్లో బంజారాహిల్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఓ టాస్క్ ఫోర్స్ సీఐకు బాధ్యతలుఇచ్చారు. ఆ సీఐనే ఈ నాగేశ్వరరావు. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారిగా ఆయనకు పేరుంది. అయితే ఆ కేసులో చివరికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు.

Also Read : భయాందోళనలు రేపుతున్న విద్యుత్ వాహనాల ప్రమాదాలు…

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు…
తమ డిపార్టుమెంట్‌కు చెందిన ఉన్నతాధికారి అయినా సరే పోలీసులు వచ్చిన ఫిర్యాదుపై సీరియస్‌గా స్పందించారు. కొన్నాళ్లుగా ఆ మహిళతో నాగేశ్వరరావు వివాహేతర బంధం కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఆ మహిళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే నాగేశ్వరరావు సీఐ కావడంతో మహిళను తరచూ లాడ్జిలకు పిలిపించుకుంటున్నారు.ఇలా పిలించుకున్న విషయం తెలిసిన భర్త చివరికి పోలీసులకే ఫిర్యాదు చేసి పట్టించారు. రాత్రి ఆ సీఐని అదుపులోకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. సిఐ పై అత్యాచారయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం….
  2. టిఎస్ ఆర్టిసిలో కారుణ్య నియమకాలు…
  3. ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
  4. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
  5. 16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు… తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.