
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ను దెబ్బకొట్టేలా బెంగాల్ తరహాలో వ్యూహరచన చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో సిద్దిపేట నుంచి గెలిచిన కేసీఆర్.. 2018 ఎన్నికల్లో మాత్రం గజ్వేల్ నుంచి పోటీ చేశారు. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ… కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేయాలని డిసైడైంది.
Read More : ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు… రైతుల పాలిట శాపాలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. బెంగాల్ తరహాలో సువేందు అధికారిలా తాను కేసీఆర్ పై విజయం సాధిస్తానని చెప్పారు. కేసీఆర్ ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందన్న రాజేందర్.. అందుకే తానే గజ్వేల్ లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తాను ముందే చెప్పానని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్ లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఎంసీ మరోసారి గెలిచింది. కాని నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. అలాంటి సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందన్నారు ఈటల రాజేందర్.
Read More : కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మరో షాక్.. పొమ్మనలేక పొడబెడుతున్నారా?
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార పార్టీని ఓడించి కేసీఆర్ కు షాకిచ్చారు ఈటల రాజేందర్. తెలంగాణ వ్యాప్తంగా ఆయన బలమైన అనుచరగణం ఉండటంతో బీజేపీ హైకమాండ్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గసమావేశాల్లో తెలంగాణపై తీర్మానం సందర్భంగా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా మాట్లాడించారు. ఈటల చేసిన ప్రసంగానికి బీజేపీ పెద్దలంతా ఫిదా అయ్యారు. కేసీఆర్ పై యుద్ధంలో రాజేందర్ ను ప్రధాన అస్త్రంగా వాడుకోవాలి కమలం పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత రోజే రాజేందర్ ను చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించారు.
Also Read : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలను బీజేపీలో చేరేలా ఈటల ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. తాజాగా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించి మరో సంచలనానికి తెర తీశారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయంలో భాగంగానే ఈటల గజ్వేల్ లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. గజ్వేల్ లో కేసీఆర్ పోటీ చేస్తే.. కేసీఆర్ కు గట్టి పోటీ ఖాయం. మల్లన్న సాగర్ నిర్వాసితులు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి …
- హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
- కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం…
- టార్గెట్ సబితమ్మ… మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
- ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
- అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
4 Comments