
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పట్టణాల నుంచి పల్లెల్లోకి రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించింది. రైతుల భూములకు రెక్కలొచ్చాయి. ఫలితంగా పచ్చగా ఉన్న పల్లెల్లో చిచ్చు రగులుతుంది. భూ వివాదాలు చిన్న తగాదాతో ప్రారంభమై హత్యల వరకు దారి తీస్తున్నాయి. ఇటీవల జిల్లాలో భూ తగాదాల హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని కోస్గి రోడ్డులో దాయిదులు నడిరోడ్డులో ఒక వ్యక్తిపై మారణాయుధాలతో దాడి చేసి పరారీ అయ్యారు.
Also Read : బీజేపీ సంచలనం.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ
ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. కోస్గి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కొడంగల్ పట్టణానికి పని నిమిత్తం రాగ పథకం ప్రకారం దాయదులు ఆయన రాకను పసిగట్టి, కొడంగల్ బీసీ బాలుర హాస్టల్ దగ్గర రోడ్డుపై సామూహికంగా మారనాయధాలతో దాడి చేశారు. దీంతో చెన్నారం గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలు చూస్తుండగానే దాయదులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వారు వచ్చిన కారులోనే కోసిగి వైపు పరారీ అయ్యారు.
Also Read : టిఎస్ ఆర్టిసిలో కారుణ్య నియమకాలు….
ఈ విషయం తెలియగానే కొడంగల్ పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. దాయదుల దాడిలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కాగా మారనాయుధాలతో దాడి చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో గాయపడిన వ్యక్తి వివరాలు తెలియవలసి ఉంది
ఇవి కూడా చదవండి :
- శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరార్.. –
- హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ సిఐ బాగోతం…
- కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం….
2 Comments