
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవ్యవసాయ, వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు వుండే అధికారిక పోర్టల్. దిని ప్రధాన ఉదేశ్యం ప్రభుత్వంలో పారదర్శకత, సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆస్తుల బదిలీలకు, సురక్షితమైన, ఇబ్భంది లేకుండా ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ ముఖ్య ఉదేశ్యం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి, ఆస్థి సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్ లో నిల్వ చేయడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వ విభజనను సరళికృతం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొద్ది నిమిషాలలో పూర్తి చేసి, అధికారిక పత్రములు నిమిషాల వ్యవధిలోనే పొందవోచ్చు. వ్యవసాయ ఆస్తుల నమోదు కోసం తహసిల్దార్ సబ్ రిజిస్టర్ గా వ్యవహరిస్తారు.
Also Read : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
కానీ ధరణి పోర్టల్ లోని సాఫ్ట్ వేర్ సమస్యల వలన రైతులు తీవ్ర ఇబ్భందులు ఎదురుకోవలిసిన పరిస్థితి ఏర్పడింది. ధరణి పోర్టల్ రాక ముందు క్రయ, విక్రయాలు (AGPA, Sale Deed) జరిగి మ్యుటేషన్ పెండింగ్ ఉండడం వలన అమ్మిన వారి పేరు మీదనే ధరణి లో భూమి ఎక్కింది. ఇది అదునుగా తీసుకొని వారు అదే భూమిని రెండోసారి అమ్ముతున్నారు. సర్వే నెంబర్ లో గుంట భూమిపై కోర్టు కేసు ఉన్నా మొత్తం సర్వే నంబర్ ను అనగా సంబంధం లేని వారి భూమిని కూడా నిషేధిత జాబితాలో (POB) పెట్టారు. ఒకసారి భూమి నిషేధిత జాబితాలో చేరితే, ధరణి మ్యుటేషన్ దరఖాస్తుని తీసుకోదు, ముందు నిషేధిత జాబితా నుండి తొలగించుకోవాలి.
Also Read : కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
తమ భూముల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేసుకోవడానికి తహసిల్దార్ కార్యాలయాలకు వస్తున్న రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. 20, 30 సంవత్సరాల క్రితం సాధబైనమిలో కొనుగోలు చేసిన భూమి ధరణిలో పాత యజమాని పేరు రావడం, లేకపోతె వేరే వ్యక్తి పేరు రావడం చూసి ఆందోళన చెందుతున్నారు. తమ భూమిని ఎవరో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రహించి, తహసిల్దార్, ఆర్డివో, కల్లెక్టర్ కార్యాలయాల చుట్టు తమకు న్యాయం చేయాలనీ కోరుతూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదంతా ధరణి పోర్టల్ సాఫ్ట్ వేర్ సమస్యే అని తెలిసిన, దానిని చక్కద్ధిదే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం ఇప్పటికి చేయకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- 16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు… తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ముంత కాబ్ ముఠా నేత అల్లుడే… ఆయన కనుసన్నల్లోనే 250 మంది ఏజెంట్లు
- బుద్ధి మారదయే…దందా ఆగదాయే…!!!
- విజయమ్మ సొంతంగానే తప్పుకున్నారా.. బెదిరించి తప్పించారా?
5 Comments