
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖ చిరకాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ పోలీస్ మాన్యువల్ (సూచనల పుస్తకం) సిద్ధమైంది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు శ్రమించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తిర్చిదిద్దిన మాన్యువల్ ముసాయుదాను ఇటివల ప్రభుత్వానికి పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం త్వరలోనే అమల్లోకి రావచ్చుని బావిస్తున్నారు. ఇందులో పలు కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది. పోలీసుశాఖ పరిపాలనా పరమైన అంశాలకు ఈమాన్యువలే కీలకం. సిబ్బంది పదోన్నతులు, బదిలీలు, సర్వీసు వ్యవహారాలను దిశానిర్దేశం చేస్తుంది.
Also Read : నడి రోడ్డుపై పట్ట పగలు కత్తులతో దాడి..!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూపొందించిన ఏపి పోలీస్ మాన్యువలె ప్రస్తుతం అమలవుతుంది. రాష్ట్ర అవసరాలకు వీలుగా తెలంగాణకు ప్రత్యేకంగా మాన్యువల్ ఉండాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు సంవత్సరాల క్రితం కసరత్తు మొదలు పెట్టారు. పదవి విరమణ చేసిన ఐజి గంగాధర్కు బాద్యతలు అప్పగించారు. రాజ్యాంగానికి లోబడి, న్యాయ పరమైన సమస్యలు రాకుండా కొత్త మాన్యువల్లో పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తుంది.
Also Read : మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి… ఇప్పుడు లాడ్జిలో అడ్డంగా దొరికాడు!
పోలీస్ శాఖలో ప్రత్యెక పోలీస్ పటాలం (టిఎస్ఎస్పి), సాయుధ (ఎఆర్), సివిల్ విభాగాల వారిగా నియామకాలు జరుగుతాయి. అనంతరం ప్రతిభ ఆధారంగా ఒక విభాగం నుండి మరొక విభాగంలోకి వచ్చే విదంగా అవకాశం వుండేది. టిఎస్ఎస్పి నుండి ఎఆర్ లోకి, ఎఆర్ నుండి సివిల్ లోకి పరిమిత స్థాయిలో కన్వర్శన్లు ఉండేవి. ఒక్కోసారి దిని వలన న్యాయపరమైన సమస్యలు వచ్చేవి. ఎఆర్ నుండి సివిల్లోకి వచ్చిన వారికీ, అప్పటికే సివిల్ విభాగంలో ఉన్నవారికి మద్య పదోన్నతులప్పుడు తరుచు వివాదాలు వస్తుండేవి. ఎఆర్ నుండి వచ్చిన వారికీ అప్పటివరకు వున్న వారి సర్వీసును పరిగణలోకి తిసుకోకుడదని, అలా చేస్తే సినియర్టిలో తమకు అన్యాయం జరుగుతుందని సివిల్ విభాగం వారు వాదించేవారు. పదోన్నతులప్పుడు ప్రతిసారి ఇలా ఏదో ఒక వివాదం తలెత్తేది. ఈసమస్య పరిష్కారానికి కొత్త మాన్యువల్ లో కాన్వర్శన్లు ఎత్తివేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అంటే ఎవిభాగంలో చేరిన వారు అవిభాగంలోనే పదవి విరమణ చేయాల్సి వుంటుంది.
ఇవి కూడా చదవండి :
- శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరార్..
- కేశంపేట రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం….
- బీజేపీ సంచలనం.. గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ
- టిఎస్ ఆర్టిసిలో కారుణ్య నియమకాలు….
One Comment