
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : కారుణ్య నియామకాలకు తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ రంగం సిద్ధం చేసింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా సర్విసులో వుండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొలువు కోసం ఎదురుచూస్తున్నాయి. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ముందుగా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేడ్-2 డ్రైవర్లు, కండక్టర్లు, కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను ఏకమొత్తం వేతనంతో నియమించనున్నారు. కారుణ్య నియామక ఉతర్వులను ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జన్నార్ జారి చేశారు.
Also Read : నటులు నరేష్, పవిత్రా లోకేష్ రహస్య వివాహం చేసుకున్నారా..?
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు కరోనా కారణంగా 2019 నుండి కారుణ్య నియామకాలు చేపట్టలేకపోయారు. పెండింగ్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని దశల వారిగా నియామకాలు చేపట్టనున్నారు. సర్వీసులో వుండి ఉద్యోగి మరణించిన తేది ఆధారంగా రీజియన్ వారిగా జాబితాను రూపొందించాలని సజ్జన్నార్ ఆదేశించారు. వివిధ మార్గాలలో డ్యూటీ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినా, డ్రైవింగ్ చేస్తు గుండెపోటుతో తాను మరణించి, ప్రయాణికుల జీవితాలను కాపాడిన ఉద్యోగి కుటుంబానికి సినియర్టితో సంబంధం లేకుండా తొలి ప్రాధాన్యంగా తక్షణం నియామకం చేపడుతామని, గతంలో ఎంపికైన వారిని సైతం వెంటనే నియమించనున్నట్లు సజ్జన్నార్ తెలిపారు.
Also Read : ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
కారుణ్య నియామకం కింద ఎంపికైనవారు మూడు సంవత్సరాల పాటు ఏకమొత్తం వేతనం కింద సర్వీసు పూర్తి చేసిన వారికీ పని తిరు అంచన పరీక్ష నిర్వహించి అందులో 60 శాతం మార్కులు సాధిస్తే పూర్తి స్థాయి స్కేల్ మేరకు సర్విసులోకి తీసుకోనున్నారు. ఈ మూడేళ్ళ వ్యవధిలో నియమితులైన ప్రతి ఉద్యోగి ఏట కనీసం 240 రోజులు పని చేసి వుండాలి. గ్రేడ్-2 డ్రైవర్లకు 19 వేలు, కండక్టర్లకు 17 వేలు, ఆర్టిసి కానిస్టేబుల్, శ్రామిక్ లకు 15 వేల రూపాయల ఏకమొత్తం వేతనం చెల్లించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామక అర్హత కలిగిన అభ్యర్ధులకు, వారు ఉద్యోగంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఖితపూర్వక లేఖలు ఇచ్చాక రిజినల్ మేనేజర్లు ఖాలీల మేరకు నియామక ప్రక్రియ చేపడుతారని సజ్జన్నార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- ముంత కాబ్ ముఠా నేత అల్లుడే… ఆయన కనుసన్నల్లోనే 250 మంది ఏజెంట్లు
- కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మరో షాక్.. పొమ్మనలేక పొడబెడుతున్నారా?
3 Comments