
క్రైమ్ మిర్రర్, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేటకు వెళ్లే రహదారి వద్ద శ్రీగిరి ఆశ్రమం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలవగా ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మధురాపురం గ్రామానికి చెందిన నక్కల రామచంద్రయ్య గౌడ్ (65)అతని భార్య నీలమ్మ (55) తన స్ప్లెండర్ బైక్ పై గ్రామానికి బయలుదేరారు.అయితే అశోక్ లేలాండ్ లారీ (ఏపీ 07 ఎక్స్ 3139) బైకు వెనుక నుండి వేగంగా ఢీకొంది. ఈ సంఘటనలో నీలమ్మ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే దుర్మరణం పాలయింది.
Also Read : ధరణి పోర్టల్ లో సాఫ్ట్ వేర్ సమస్యలు…రైతుల పాలిట శాపాలు
నీలమ్మ బైక్ పై నుండి కింద పడటంతో ఆమె తల లారీ చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె మొండెం, తలభాగం వేరయింది. దారుణంగా జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు బితీల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ నవీన్ కుమార్ సంఘటన స్థలానికి ఎస్సై విజయ్ తదితర సిబ్బందిని పంపించారు. లారీ అక్కడే వదిలేసి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. సంఘటన స్థలం వద్ద ఎస్సై విజయ్ ప్రాథమిక దర్యాప్తు చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదేవిధంగా సంఘటన గురించి తెలుసుకొని మధురాపురం జడ్పిటిసి పి.వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ భార్గవ కుమార్ రెడ్డి, జర్నలిస్ట్ మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పుల్లారెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున రోదించారు. జరిగిన సంఘటనతో మధురాపురం గ్రామంలో విషాదం అలుముకుంది. రోడ్లు గుంతల మయం కావడంతో లారీ వేగంతో బైక్ ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- 16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు… తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ముంత కాబ్ ముఠా నేత అల్లుడే… ఆయన కనుసన్నల్లోనే 250 మంది ఏజెంట్లు
- టిఎస్ ఆర్టిసిలో కారుణ్య నియమకాలు…
4 Comments