
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైసిపి ప్లినరి వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. వైసిపి గౌరవాద్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను పదవి నుండి తప్పుకొని…ఇటు జగన్…అటు షర్మిల తల్లిగా, బాధ్యతగా వారి వెనుక నిలుస్తానని స్పష్టం చేశారు. జగనన్న వదిలిన బాణంగా షర్మిల పాత్రను ఆమె వివరించారు. మాకుటుంబం ఎప్పుడు ప్రజలకు ఋణపడి ఉంటుందని ప్లినరి వేదికగా విజయమ్మ చేప్పుకోచారు. తమ కుటుంబం అభిమానంతో బతికిన కుటుంబమంటూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తమ మద్య అనుభంధాలు గొప్పవని, తన అన్నకు కష్టం రాకూడదనే షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేసి అండగా నిలుస్తోందని తెలిపారు.
Also Read : వైయస్సార్ సిపి క్యాడర్ లో అసంతృప్తులు
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణాలో షర్మిల పోటి చేయనుంది. జగన్ సైతం ఎపి లో కీలకంగా ఉన్నారు. జగన్..షర్మిల ఇద్దరు వేరువేరు రాష్ట్రాలకు ప్రతినిదిలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎన్నడు వుహించాలేదని చెప్పుకొచ్చారు. దేవుడు నడిపిస్తాడని నమ్ముతానని తెలిపారు.వక్రికరనలకు అవకాశం లేకుండా ఇద్దరు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రెండోసారి ముక్యమంత్రిగా జగన్ వుంటారనే నమ్మకం వుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన నిర్ణయాన్ని అర్ధం చేసుకోవాలని, తనను క్షమించాలని విజయమ్మ కోరారు. తాను సంతకం చేయని ఒక లేఖను విడుదల చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
షర్మిల తెలంగాణాలో ఒంటరిగా పోరాటం చేస్తున్నారని తల్లిగా అండగా నిలబడాల్సిన అవసరం వుందని వివరించారు. కుమార్తె కష్టాల్లో వున్నా సమయంలో వదలటం సరి కాదనేది తన అభిప్రాయమని విజయమ్మ వివరించారు. వైఎస్ఆర్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేశారు. జగన్ రాజకీయంగా బలపడిన విధానం గురించి చెప్పుకొచ్చారు. జగన్ను జననేతగా అభివర్ణించారు. వైఎస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ పోమ్మనకుండా పొగ పెట్టిందని చేప్పుకోచారు. జగన్ తక్కువ కాలంలోనే సీనియర్ నాయకుల గొంతు తడి అరిపోయేలా చేసారంటూ తెలిపారు.
Also Read : టిడిపి కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టను.. చంద్రబాబు
అధికారం కోసం అనేక పార్టీలు పుడుతూ ఉంటాయని, కానీ ఇచ్చిన మాట కోసం..ప్రజల కోసం పుట్టిన పార్టీ వైసిపి పార్టీ అని ఆమె తెలిపారు. జగన్ అధికారంలోకి రావడం వెనుక అనేక కష్టాలు ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించారని గుర్తు చేసుకున్నారు. అధికారిక శక్తులన్నీ కలిసి విరుచుకపడ్డ చలించలేధన్నారు. జగన్ వైఎస్ఆర్ కుమారుడిగా రాజకీయంలో కాలు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక పధకాలు అమలు చేసాడని చెప్పుకొచ్చారు. తన బిడ్డను మీచేతుల్లో పెట్టనని గతంలోని మాటను గుతూ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రని రానున్న రోజుల్లో తలెత్తుకునే విధంగా చేస్తాడని తెలిపారు. పేద పిల్లల భవిష్యత్తును జగన్ చేతుల్లో పెట్టాలంటూ పిలుపునిచ్చారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర ప్రారంభించిన సమయంలో తాను భయపదడ్డనని…..ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ఈరోజు జగన్ అధికారంలో వున్నారని విజయమ్మ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
- నటులు నరేష్, పవిత్రా లోకేష్ రహస్య వివాహం చేసుకున్నారా..?
- వైసిపి ప్లినరి వేళ…..టిడిపి కౌంటర్ ప్లాన్
- సాధించాల్సింది.. ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉంది..
- ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది..
- వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్ కేసు
- నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం?
One Comment