
క్రైమ్ మిర్రర్ నిఘా ప్రతినిధి బృందం : ముంత కాబ్ ముఠా లో కొత్త నాయకుడు పుట్టుకొచ్చాడు. ఇన్నాళ్లు నల్గొండ పట్టణానికి చెందిన యూసఫ్ ఖాన్, నగరంలోని పాతబస్తీకి చెందిన షేక్ జిలాని ల కనుసన్నల్లో నడిచిన ముంతకాబ్ ముఠా, ఇప్పుడు యూసుఫ్ ఖాన్ అల్లుడు సతీష్ అలియాస్ సత్యనారాయణ అన్ని తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 250 మంది ఏజెంట్లను నియమించుకొని, అటు యూసుఫ్ ఖాన్, షేక్ జిలాని వద్ద కమిషన్లు తీసుకుంటూనే, ఇటు ఏజెంట్లకు ప్లాట్లు ఇప్పించినందుకు కమిషన్ దండుకుంటున్నట్లు సమాచారం. రెండు చేతుల సతీష్ సంపాదిస్తూ కోట్లకు పడగ లెత్తాడని పలువురు పేర్కొంటున్నారు. ఒకనాడు సాధారణ డ్రైవర్ గా జీవితాన్ని గడిపిన సతీష్ కు , ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు.
Read More : సినిఫక్కిలో గంజాయి రవాణా…ఉప్పల్లో 440 కిలోల గంజాయి పట్టివేత…
సతీష్ ఒకవైపు తన మామ ఆస్తులకు బినామీగా వ్యవహరిస్తూనే, ఆయన వద్దే డబ్బులు తీసుకుని భువన నిర్మాణాలను చేపట్టి విక్రయిస్తున్నానని, బిల్డర్ అవతారమెత్తానని తనకు తానే చెప్పుకుంటున్నాడు. గతంలో సాధారణ ఉద్యోగి అయిన సతీష్ కు బిల్డర్ గా భవన నిర్మాణాలు చేపట్టి విక్రయించే అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముంత కాబ్ ముఠా లో చేరి, అటు ముఠా నాయకుల వద్ద, ఇటు ఏజెంట్ల వద్ద నుంచి కమిషన్లు దండుకోవడం ద్వారానే కోట్ల రూపాయలను సంపాదించాడని పలువురు పేర్కొంటున్నారు. కోట్ల కు పడగలెత్తిన సతీష్ అటు ఆదాయపన్ను శాఖను కూడా మోసగిస్తూ, తన ఆస్తులకు ట్యాక్స్ ను చెల్లించడం లేదని వారు పేర్కొంటున్నారు. తక్షణమే ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి సతీష్ ఆస్తులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డి బ్రదర్స్ రూట్ మార్చారా? హరీష్ రావుతో రహస్య మీటింగ్ ఎందుకు?
- బుద్ధి మారదయే… దందా ఆగదాయే…!!!
- సర్జరీ కోసం పేషెంట్ పుర్రెను తొలగించి.. అతికించకుండానే డిశ్చార్జ్!
- ముందస్తు ఎన్నికలకు వెళ్లి తేల్చుకుందాం రా.. బీజేపీకి మంత్రి తలసాని సవాల్
- మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్న ఎస్ఐ.. దుమ్ము దులిపిన భర్త
2 Comments