
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : పేదల కడుపులు నింపేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా తరలుతుంది. ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని లబ్దిదారుల నుండి కొనుగోలు చేసి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. కొంతమంది వ్యక్తులను కేవలం ఇదే పని కోసం ఏర్పాటు చేసుకొని దందాను నిర్వహిస్తున్నారు కొందరు అక్రమార్కులు. అలాగే కొందరు రేషన్ డీలర్లు డైరెక్టుగా రేషన్ బియ్యాన్ని మాఫియాకు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక నెల లబ్దిదారులకు బియ్యం సరఫరా చేస్తే, మరొక నెల అక్రమంగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ ఉంచడానికి అక్రమార్కుల దగ్గర ప్రత్యెక రైస్మిల్లులే ఉనయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతుంది. అక్రమంగా నిల్వ ఉంచిన రైస్ మిల్లులోనే పాలిషింగ్ చేసి, ఆబియ్యాన్ని కొత్త బ్యాగులలో నింపుతారు. అసలు రేషన్ బియ్యమనే అనుమానం రాకుండా ప్యాక్ చేసి లారీలలో, ప్రత్యెక కంటేనర్ వాహనాలలో రాష్ట్రని దాటిస్తున్నారు.
Also Read : తెలంగాణాలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా నిరుపేదలకు పంపిణి అయ్యే బియ్యాన్ని కొందరు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఒక ప్రదేశం డంప్ చేసి రాత్రి వేళ్ళలో గుట్టుగా ఆటోలు, ట్రాలీల ద్వారా మిల్లులకు సరఫరా చేస్తున్నారు. గ్రామాలలోని ప్రజల నుండి 8 నుండి 10 రూపాయలకు బియ్యం కొనుగోలు చేసి మిల్లుల యజమానులకు 12 నుండి 14 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ఇబియ్యాన్ని ఎఫ్సిఐకే అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మొత్తం తతంగంలో రేషన్ డీలర్లు ముక్య భూమిక పోషిస్తున్నారా..చౌక డిపోల ద్వారా అందించే బియ్యం కోసం వెళ్ళే ప్రజలలో ఎక్కువగా తమ రేషన్ కార్డు కాపాడుకోవడం కోసమే వెళ్తున్నారు. మూడు సార్లు బియ్యం తీసుకోకపోతే కార్డు రద్ధవుతుందనే భయంతో మాత్రమే వెళ్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండటంతో ప్రస్తుత కాలంలో పేదవారు సైతం తినడం లేదు. దిన్ని ఆసరాగా చేసుకుంటున్న రేషన్ డీలర్లు, రేషన్ కార్డు దారులనుండి 6 రూపాయలకే కిలో బియ్యాన్ని కొని మిల్లు యజమానులకు 12 రూపాయల వరకు అమ్ముకుంటున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి.
Also Read : ఎల్లారెడ్డిలో దారుణం..శారీరక సుఖం కోసం భర్తను చంపిన భార్య
సబ్సిడీ ద్వారా పేదలకు కిల్లో బియ్యం కేవలం ఒక్క రూపాయకే లబిస్తుంది. అయితే అక్రమ దందా పరిస్థిని బట్టి వ్యాపారాలు కిలో బియ్యం 10 నుండి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని మిల్లర్లకు 22 నుండి 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఈరేషన్ బియ్యాన్ని గొనె సంచుల నుండి ప్లాస్టిక్ సంచులకు మార్చడానికి 25 రూపాయల చొప్పున ఖర్చవుతుంది. తరువాత ఖాలి బస్తా అమ్మితే 20 రూపాయలు రికవరీ వస్తుంది. రవాణా ఖర్చు 100 నుండి 120 వరకు అవుతుంది. పనులు, ఇతర ఖర్చులు 200 వరకు అవుతాయి. అంత కలిపితే 1700 నుండి 1900 రూపాయల వరకు ఖర్చవుతుండగా, బహిరంగ మార్కెట్ లో 2500 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.
చేతులు, స్థలాలు మరీనా ప్రతి క్వింటాకు 500 నుండి 600 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందంటే దందా ఎస్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంది. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు లబ్దిదారులు అమ్ముకుంటున్నారు. కొనులు చేసే వారిపై జిల్లా పోలీసులు తరుచు కేసులు పేడుతున్నారు. గతంలో రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడి, మళ్ళి అదే దందాను కొనసాగిస్తున్న వారిపై పోలీసులు పిడి యాక్టులు నమోదు చేసి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలా పిడిఎస్ బియ్యాన్ని అక్రమ మార్గంలో సేకరిస్తూ, బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్న కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యం అమ్మిన, కొన్నా నేరమేనని హేచరిస్తున్నారు. అయిన పోలీసులు చెప్తే మకేంటని బుద్ధి మార్చుకోకుండా కొందరు అక్రమార్కులు ఈదందాను కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మరో షాక్.. పొమ్మనలేక పొడబెడుతున్నారా?
- నటులు నరేష్, పవిత్రా లోకేష్ రహస్య వివాహం చేసుకున్నారా..?
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడు…!!
- రైతుబంధు సొమ్ము…పాత బాకిలకు !
One Comment