Andhra Pradesh

టి‌డి‌పి కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టను.. చంద్రబాబు

వేధించేవారిని వదిలిపెట్టను. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు కచ్చితంగా చెబుతున్నా. మీ బలహీనతలను అడ్డుపెట్టుకుని మిమ్మల్ని అక్రమాలకు వాడుకుంటున్నారు. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎక్కడున్నా తప్పించుకోలేరు. రేపు ట్రైబ్యునల్ వేసి వడ్డీతో చెల్లించేలా శిక్షిస్తాం. సీఐడీ చీఫ్ మిమ్మల్ని కాపాడలేరు. తమాషాలు చేయొద్దు. నేను చండశాసనుడిలా ఉంటా.. జాగ్రత్త

  • » నవరత్నాల పేరుతో నవఘోరాలు
  • » మంత్రి పెద్దిరెడ్డికి అన్ని కాంట్రాక్టులా..? 
  • » అమ్మబడి బూటకం.. ఆంగ్ల మాధ్యమం నాటకం
  • » మినీ మహానాడులో చంద్రబాబు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ‘అధికారం ఇస్తే తమాషాలు చేస్తారా? సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 కేసులు పెట్టారు. 128 మందిని అరెస్టుచేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగితే నేను చేశానంటూ నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పత్రిక రాసింది. ఆ పత్రిక ఎండీ భారతిరెడ్డిని అరెస్టు చేయగలరా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ‘ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా’ పేరుతో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. నవరత్నాల పేరుతో వైకాపా ప్రభుత్వం నవఘోరాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

Read More : వైసిపి ప్లినరి వేళ…..టిడిపి కౌంటర్ ప్లాన్

‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారంటూ ఇటీవల పలువురిని అరెస్టుచేసి కొట్టారు. అలా కొట్టిన సీఐని గుర్తుపెట్టుకున్నాం. సీఎం జగన్.. తన బాబాయ్ హత్య కేసును ఆయన కుమార్తె మీదే నెట్టేసే కుట్ర చేస్తున్నారు. వివేకా కేసులో ఇప్పటికే ముగ్గుర్ని చంపేశారు. సత్తెనపల్లి దగ్గర రైలు బోగీ దహనం చేసి ఎంపీ రఘురామకృష్ణరాజును చంపే కుట్ర చేశారు. ఆయన గ్రహించి తిరిగి మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. ఆయనపైనే తిరిగి ఇప్పుడు అన్యాయంగా కేసు పెట్టారు’ అని మండిపడ్డారు. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. తండ్రి.. కొడుకు… తమ్ముళ్లు పదవులు పంచుకుంటూ ఇసుక, గనులు, మద్యం పేరుతో దోచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండేవారికి కాంట్రాక్టు పనులు ఇవ్వడమా? పులివెందుల నుంచి పుంగనూరుకు పైపులైను పనులు, పుంగనూరులో మరో జలాశయం పనులు కాంట్రాక్టును ఏకపక్షంగా కట్టబెట్టారు.

Read More : నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం?

వీటి కథంతా చూస్తాం’ అని హెచ్చరించారు. ‘మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాడుతున్నాం. ఎక్కడ చూసినా సమస్యలే. ప్రశ్నించినవారిని బెదిరించి కేసులు పెడుతున్నారు. మేం కన్నెర్ర చేస్తే వైకాపా నేతలు బయటకు రాలేరు. నాడు మేం తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా? ఆ రోజు ఊరూరూ తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు.

మా హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు కట్టించాం. మండలానికో జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్ కో ఇంజినీరింగ్, జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటు చేశాం. ఇప్పుడేమో 8వేల గ్రామాల్లో పాఠశాలలు మూసేశారు. వీటిని మూయకుండా అడ్డుకోండి’ అని పిలుపునిచ్చారు. ‘ఇటీవల ఇంటర్, పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని చూసి 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సీఎం చదవలేదు. ఇతరులు చదవరాదని బడులు మూసేసి చెట్లు.. పుట్టలు.. వాగులు.. వంకలు దాటుకుని చదువుకునేలా కక్షలకు పాల్పడుతున్నారు. జగన్ కూతుళ్లు విదేశాల్లో చదవాలి. అమ్మఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేశారు. అమ్మఒడి బూటకం.. ఇంగ్లీషు మీడియం ఓ నాడు- నేడు అవినీతిమయం’ అని ఘాటుగా విమర్శించారు.

More Read : కేసీఆర్ పై బండి సంజయ్ బ్రహ్మాస్త్రం.. వణికిపోతున్న టీఆర్ఎస్ లీడర్లు! ఏం జరగబోతోందో?

పోరాడేందుకు ఇంటికొకరు రావాలి: ‘ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు రావాలి. ఒకరిని అరెస్టు చేస్తే వందమంది వెళ్లి నిలదీయాలి. మీకు అండగా ఉంటాం. 24 గంటలు పనిచేసేలా మీకు ఫోన్ నంబరు ఇస్తాం. అన్ని రకాలా ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారు. మూడేళ్లలో 5సార్లు విద్యుత్తుఛార్జీలు పెంచారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ఇంటికొకరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. కుండపోతలా వాన కురిసినా సభ నుంచి జనం కదలకుండా చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యేవరకూ వేచి ఉన్నారు.

ఇవి కూడా చదవండి …

  1. రైతుబంధు సొమ్ము…పాత బాకిలకు !
  2. టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
  3. సామాన్యుడిపై గ్యాస్ భారం…
  4. నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.