
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : తెలంగాణ రాజకీయాల్లో జంపింగుల పర్వం కొనసాగుతోంది. ఏ రోజు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలు మరింత రంజుగా మారిపోతున్నాయి. అధికార, విపక్షాల పోటాపోటీ వ్యూహాలతో ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యానాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వర్గ పోరుతో సతమతమవుతున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం త్వరలోనే కారు దిగుతారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా భావించింది. అయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.
Read More : కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మరో షాక్.. పొమ్మనలేక పొడబెడుతున్నారా?
బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారనే ప్రచారం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సడెన్ గా రూట్ మార్చారని తెలుస్తోంది. తన అన్న కోమటిరెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావుతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు తొర్రురులోని ఓ ఫాం హౌజ్ లో హరీష్ రావుతో చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరాలని చూసినా అక్కడ తాము సెట్ కాలేమని భావనకు వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ అధికార పార్టీకి టచ్ లో వచ్చారని తెలుస్తోంది. హరీష్ రావుతో చర్చల సందర్భందా కొన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ కొన్ని కండీషన్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఒక ఎంపీ సీటుతో పాటు 10 ఎమ్మెల్యే సీట్లు తాము సూచించిన వాళ్లకు ఇవ్వాలని హరీష్ రావుకు చెప్పారని తెలుస్తోంది. అయితే హరీష్ రావు మాత్రం ఒక ఎంపీతో పాటు మూడు అసెంబ్లీ సీట్లకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత మరో రెండు సీట్లకు అంగీకారం కుదిరే అవకాశం ఉందని టాక్.కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీ సీటుతో పాటు నల్గొండ, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సీట్ల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు పడుతున్నారని తెలుస్తోంది.
Read More : రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
మంత్రి హరీష్ రావుతో కోమటిరెడ్డి బ్రదర్స్ చర్చల విషయం పీసీసీ పెద్దలకు తెలిసిందని తెలుస్తోంది. అందుకే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ విషయంలో దూకుడు పెంచారని అంటున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వర్గానికి చెందిన బాలునాయక్ కు చెక్ పెడుతూ బిల్యానాయక్ ను పార్టీలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఢీ అంటే ఢీ అని పోరాడిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరేశాన్ని రౌడీతో పోల్చుతూ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. అందుకే కోమటిరెడ్డి చెక్ పెట్టేందుకే వేముల వీరేశాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాగుతున్నారనే టాక్ వస్తోంది. తుంగతుర్తి విషయంలోనూ కోమటిరెడ్డి కండువా కప్పిన వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని పీసీసీ చీఫ్ తేల్చి చెప్పారని చెబుతున్నారు. ఆలేరులోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకంగా ఉన్న అయోధ్య రెడ్డితో పాటు గతంలో టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన బండ్రు శోభారాణిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.
Also Read : టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని దాదాపు ఆరు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కాని ఎర్ర శేఖర్ చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకించారు. నేరస్తులను పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు సార్లు డేట్ ఫిక్స్ అయినా ఎర్రశేఖర్ చేరిక వాయిదా పడింది. గురువారం ఎర్ర శేఖర్ ను పార్టీలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి అభ్యంతరాలను పట్టించుకోకుండానే తాను చేయాల్సింది చేసేశారు. ఇందుకు కారఁం హరీష్ రావుతో కోమటిరెడ్డి బ్రదర్స్ సమావేశం కావడమే అంటున్నారు. కోమటిరెడ్డిని పట్టించుకోవద్దని రేవంత్ రెడ్డికి హైకమాండ్ కూడా సిగ్నల్ ఇచ్చిదంటున్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, కోమటిరెడ్డికి పట్టు తగ్గుతుండటంతో ఆయన వర్గంగా ఉన్న కొందరు నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. ఆలేరు టికెట్ ఆశిస్తున్న బీర్ల అయిలయ్య ఇంతకాలం కోమటిరెడ్డి వర్గంగా ఉండగా.. ఇటీవల రేవంత్ రెడ్డికి దగ్గర అయ్యారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- తెలంగాణాలో కుండపోత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎల్లారెడ్డిలో దారుణం..శారీరక సుఖం కోసం భర్తను చంపిన భార్య
- నటులు నరేష్, పవిత్రా లోకేష్ రహస్య వివాహం చేసుకున్నారా..?
- సాధించాల్సింది.. ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉంది..
- ఉగ్రవాద సంస్థతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు లింకులు