
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై గ్యాస్ భారం గత ఏడాది నుండి క్రమంగా పెరుగుతుపోవడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఇప్పటికే కొత్త గ్యాస్ కనక్షన్ తీసుకోవడం భారంగా మారింది. ఈ తరుణంలో ప్రతి నెల గృహవసర సిలిండర్ ధర పెంచుతుండటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారవుతుంది సామాన్యుల పరిస్థితి. గత ఏడాది జూలై నుండి ఇప్పటి వరకు 218 రూపాయలు పెరగడం గమనార్హం. చమురు సంస్థలు 14.2 కిలోల సిలిండర్ పై తాజాగా మరో 50 రూపాయలు పెంచడంతో 1055 రూపాయలు వున్న ధర ప్రస్తుతం 1105 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం?
సాధారణంగా ప్రతినెల ఒకటవ తేదిన గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు వుంటాయి. ఈనెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 183.50 రూపాయలు తగ్గించగా, ఇప్పుడు మరు 8.50 రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు, గృహవసర సిలిండర్ ధరలను మాత్రం పెంచాయి. ధరలు పెరిగినప్పుడల్లా అంతకు వారం రోజుల ముందు బుక్ చేసుకున్నవారికీ కొత్త ధరలే వర్తింపజేస్తున్డటం గమనార్హం. మే నెలలో 50 రూపాయల పెంపుతో 1052 రూపాయలు కాగా, తరువాత కమిషన్ చార్జీల కింద మరో 3 రూపాయలు పెంచారు. తాజాగా మరో 50 రూపాయల పెంపుతో 1105 రూపాయలకు చేరుకుంది.
కేసీఆరా మజాకా.. ఎమ్మెల్యేల జీతాల్లో తెలంగాణే టాప్…….
రాయితీ కోత, డెలివరి బాయ్ కి ఇచ్చే మొత్తం కలుపుకొని సిలిండర్ ధర మరింత పెరుగుతుంది. సాధారణంగా డెలివరి బాయ్ లకు గ్యాస్ ఏజెన్సీలే డబ్భు చెల్లించాలి. ఏజెన్సీ తమకు ఏమి చెల్లించదని చెప్పే డెలివరి బాయ్లు వినియోగదారుల నుండి డెలివరి చార్జీలను వసులు చేస్తున్నారు. ఇల్లు వున్న అంతస్తును బట్టి ఇది పెరుగుతు పోతుంది. సిలిండర్లపై ప్రభుత్వం రాయితీని దాదాపు ఎత్తేయడంతో వినియోగదారుడికి ఖాతాలో కేవలం 40 రూపాయలకు అటుఇటుగా జమవుతుంది.
ఇవి కూడా చదవండి :
నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…
ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది..
కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ! మోడీ అందుకే ఆయన పేరు ఎత్తలేదా?
ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?
3 Comments