
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పంటల సాగు సమయంలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్భంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబందు పధకం లక్ష్యానికి బ్యాంకర్లు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న రైతుబందు సొమ్మును పాత బకాయిలకు మళ్ళిస్తున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు చెల్లించలేదని, రెన్యువల్ కూడా చేయడం లేదనే కారణంతో రైతుబందు సొమ్మును బ్యాంకర్లు రికవరీ చేసుకుంటున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు ఇబ్భందులు పడుతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి కోసం ఇచ్చే సొమ్మును బ్యాంకు వారు తమ చేతికి అందనివ్వడంలేదని, క్లిష్ట పరిస్థితులో పాత భాకిల కిందకు మళ్ళించడమేంటని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి బ్యాంకులో పంట రుణం తీసుకుంటే ఏడాది వరకు ఎప్పుడైన చేలించాల్సిన నిబంధన ఉంది.
Also Read : టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్..
గతేడాది మాత్రమే కాకుండా 2018 నాటికీ వున్న పంట రుణాలను కూడా రికవరీ చేసుకుంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. 50 వేల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన 34 వేల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా రెండు మూడు విడతలు పెండింగ్లో వున్నాయి. రైతుబందు డబ్బులను పాత బకాయిలకు మలించడం పట్ల రైతులు ప్రశ్నిస్తే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వున్నాయని, ఎలాగైనా డబ్బులు రికవరీ చేయాలనే ఆదేశాల మేరకే పాత బకాయిలకు రైతుబందు సొమ్మును మల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెపుతున్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, బ్యాంక్ నుంచి ,రైతుబందు సొమ్ము ఖాతాలో జమైనట్లు మొబైల్ ఫోన్కు సంక్షిప్త సందేశం రాగానే రైతులు బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు.డబ్బు డ్రా చేద్ధామంటే బ్యాలెన్సు లేదని బ్యాంకు సిబ్భంది చేభుతున్నారు.
Also Read : కేసీఆర్ పై బండి సంజయ్ బ్రహ్మాస్త్రం.. వణికిపోతున్న టీఆర్ఎస్ లీడర్లు! ఏం జరగబోతోందో?
ఈ వానాకాలంలో ఇప్పటివరకు రైతుబందు ఆర్ధిక సహాయం పొందిన వారంతా చిన్న, సన్నకారు రైతులే కావడం గమనార్హం. కోట్లు, లక్షల రూపాయలు బకాయిలు ఉన్నవారిని వదిలేసి, పంటపెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చిన 5 వేలు, 10 వేల రూపాయలను రికవరీ చేసుకోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయని, ప్రైవేటు అప్పులు చేస్తే వడ్డీ రేటు ఎక్కువవుతుందని, ప్రభుత్వం అందించే కొద్దో గొప్పో సాయాన్ని కూడా బ్యాన్కర్లె రికవరీ చేసుకుంటే ఎంచేయాలనీ రైతులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది కూడా ఇదే విధంగా బ్యాంకర్లు రైతుబందు నిధులను పాత బకాయిల కింద జమ చేసుకుంటే, రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకొని ఎట్టిపరిస్థితిలోను పాత బకాయిలకు రైతుబందు సొమ్మును మళ్ళించవద్దని, పెట్టుబడి సాయం కింద ఇచ్చే సొమ్మును రైతులకు నేరుగా ఇచ్చేయాలని ఆదేశాలు జారి చేశారు.
Also Read : నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం?
గత నాలుగైదు రోజులుగా నిలిచిపాయిన రైతుబందు నిధుల విడుదల బుధవారం నాడు తిరిగి ప్రారంబమైంది. ఖజానాలో నిధుల కొరత కారణంగా మూడెకరాల వరకు భూమి వున్న రైతులకు చెల్లింపులు చేసి తరువాత నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐతే రిజర్వ్ బ్యాంక్ నుండి రెండో త్రైమాసికానికి సంభందించి రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. నిధులు సర్దుబాటు కావడంతో బుధవారం నుండి రైతుల ఖాతాలలో రైతుబందు నిధులను జమ చేయడం ప్రారంభించారు. 4, 5 ఎకరాల వరకు భూమి వున్న 4.45 లక్షల మంది ఖాతాలలో 855.29 కోట్ల రూపాయలను జమ చేశారు.
ఇవి కూడా చదవండి :
- సామాన్యుడిపై గ్యాస్ భారం…
- నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…
- ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
- అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
9 Comments