
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రేమ పేరుతో వలలో వేసుకుని.. పెళ్లి పేరుతో లోబర్చుకున్న యువకుడు యువతిని మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు.తీరా ఆమె పెళ్లికి పట్టుబడడంతో మాయమయ్యాడు.దీంతో పట్టువదలని యువతి అతని ఇంటికి వెళ్లి నిలదీసింది.10 తులాల బంగారం…10 లక్షల నగదు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా అన్న యువకుడి కుటుంబ సభ్యులు.దింతో ఆ యువతి మనోవేదనకు గురై బ్లేడ్ తో తన గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలంలో కుట్టు పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read : కేసీఆరా మజాకా.. ఎమ్మెల్యేల జీతాల్లో తెలంగాణే టాప్..
యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఇసిఐఎల్ కు చెందిన దీప బంజారా హిల్లరీనిలోని ఓ సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న వీరిరువురికి ఆరు నెలల క్రితం పరిచయమైంది.ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుంటానని చెప్పిన నవీన్ ఇప్పుడు మోకం చాటేశాడని యువతి ఆరోపించారు.వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటానని మొండికేయగా…గ్రామ సర్పంచ్,కొందరు పెద్దలు మీ ఇంట్లో పెద్దవారిని తీసుకుని వస్తే మాట్లాడి ఒప్పిద్దామని యువతికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపిచారని యువతి తెలిపింది.
Also Read : టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు.పది లక్షల కట్నం,పది తులాల బంగారం ఇస్తే గాని పెళ్లి చేసుకునేది లేదంటూ యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి అక్కడే ఉన్న బ్లేడ్ తో గొంతు కోసుకుంది.యువతిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చి ప్రథమ చికిత్స అందజేసి హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఇట్టి సంఘటనపై ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు కాకపోవడం గమనార్థం.
ఇవి కూడా చదవండి :
- రైతుబంధు సొమ్ము…పాత బాకిలకు !
- నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…
- సామాన్యుడిపై గ్యాస్ భారం..
- మందుబాబులు పండగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు!