
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి : తెలంగాణతో దశాబ్దాల అనుభంధం కలిగి వున్న కాకతీయుల చరిత్ర, పాలన వైభవం, కళవిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో తెలంగాణా రాష్ట్ర ప్రబుత్వం గురువారం నుండి వారం రోజుల పాటు వరంగల్, హైద్రాబాద్ నగరాలలో కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ దినిని ప్రారంభించనున్నారు. ఈ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. కాకతీయుల వారసుడు మహారాజా కమల్ చంద్ర భంజదేవ్ కాకతీయ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. గురువారం నాడు ప్రారంభోత్సవాలు వరంగల్లో జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రం హైద్రాబాద్లోని మాదాపూర్ లో కాకతీయుల పాలనకు సంభందించిన 777 చిత్రాల ప్రదర్శనను మంత్రులు కేటి రామారావు, శ్రీనివాస్ గౌడ్లు ప్రారంభిస్తారు.
also read : సినిఫక్కిలో గంజాయి రవాణా…ఉప్పల్లో 440 కిలోల గంజాయి పట్టివేత…
ఈనెల 8 న వరంగల్లో కవిసమ్మేళనం, 9 నుంచి భద్రకాళి భాండ్ వద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. 10 న చిత్రకళ ప్రదర్శన, 11 న లఘు చిత్రకళ ప్రదర్శనలు, 12 న వరంగల్ నిట్ లో మిషన్ కాకతీయ, కాకతీయుల సిద్ధాంతాలపై సదస్సులను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం వరంగల్ కోటలో కార్నివాల్ జరుగుతుంది. 13 న రామప్ప ఆలయంలో ముగింపు వేడుకలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా నాటక సప్తాహం, శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ముగింపు వేడుకలకు మంత్రులు రామారావు, శ్రీనివాస్ గౌడ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు హాజరు కానున్నారు.
also read : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగే షాక్.. పోతే పోనీ అనుకుంటున్నారా?
కాకతీయ రాజుల వంశీయుడైన కమల్ చంద్ర భంజదేవ్ ను ఖిలా వరంగల్ కోటకు ఆహ్వానించడానికి పెద్ద ఏత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పడమర కోట ద్వారం నుండి వేద పండితులు వేద మంత్రాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. పలువురు సైనికుల వేషధారణలో ముందు నడుస్తూ వుండగా అయన గుర్రపు బండిలో కూర్చొని ప్రయనిస్తారు. అయన మద్య కోట మీదుగా వెళ్ళి కాకతీయుల కాలం నాటి పురాతన స్వయంభు శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి :
నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ గూటికి వేముల వీరేశం?
కేసీఆర్ పై బండి సంజయ్ బ్రహ్మాస్త్రం.. వణికిపోతున్న టీఆర్ఎస్ లీడర్లు! ఏం జరగబోతోందో?
కేసీఆరా మజాకా.. ఎమ్మెల్యేల జీతాల్లో తెలంగాణే టాప్…….
కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ! మోడీ అందుకే ఆయన పేరు ఎత్తలేదా?
One Comment