
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి : మంత్రి సబితా రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సొంత పార్టీ నేతలే ఆరోపణలు, విమర్శలను గుప్పిస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి , నేడు టిఆర్ఎస్ మరో సీనియర్ నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు కూడా చేయలేని భూకబ్జా ఆరోపణలను సొంత పార్టీ నాయకులు చేయడం చర్చకు దారితీసింది.
Also read : టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్ ..
స్కూలు, చెరువు స్థలాల కబ్జాను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తీగలకు తోడు, అవే ఆరోపణలను మనోహర్ రెడ్డి కూడా రిపీట్ చేయడం ద్వారా ప్రజల్లో అనుమానపు బీజాన్ని రేకెత్తించారు. ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న అధికార పార్టీలో, ఈ గ్రూప్ తగాదాలు ఏమిటన్న వాదనలు లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు మహేశ్వరం అధికార పార్టీలో అంతా సవ్యంగానే కనిపించినప్పటికీ, బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్ల గూడెం సంతోషా శ్రీనివాస్ రెడ్డి లు కారు దిగి హస్తం గూటికి చేరడం… ఆ మరుసటి రోజే మంత్రిని లక్ష్యంగా చేసుకొని తీగల ఫైర్ అవడం , తీగల దారిలోని మనోహర్ రెడ్డి కూడా ఆరోపణలు గుప్పించడం పరిశీలిస్తే… మహేశ్వరం కారు కుదుపులకు గురవుతున్నట్లు స్పష్టమవుతుంది.
Also read : రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. బడంగ్ పేట మేయర్..
మంత్రి పై సొంత పార్టీ నేతలే చేస్తున్న ఆరోపణలను ఆమె వర్గీయులు ఎంతగా తిప్పి కొట్టినప్పటికీ, నిప్పు లేనిదే పొగ రాదు కదా… అన్న అనుమానాలు ప్రజల్లో లేకపోలేదు. మహేశ్వరంలో రానున్న ఎన్నికల్లోను సబితా ఇంద్రారెడ్డికి తిరుగు లేదన్న పీకే సర్వే రిపోర్ట్ నేపథ్యంలో, సొంత పార్టీ నేతలే ఈ విధంగా ఆరోపణలు గుప్పించడం ప్రజల్లో ఆమె ప్రతిష్టను మసకబార్చేవిగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- సామాన్యుడిపై గ్యాస్ భారం… –
- నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…
- కేసీఆరా మజాకా.. ఎమ్మెల్యేల జీతాల్లో తెలంగాణే టాప్…..
2 Comments