
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు చల్లారినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. సీనియర్లు ఎంతగా వ్యతిరేకిస్తున్నా.. హైకమాండ్ కు తనపై ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు చేస్తున్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తాను అనుకున్నది చేస్తూ వెళుతున్నారు. సీనియర్లు అడ్డుకోవాలని చూసినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు రేవంత్ రెడ్డి. తాజాగా సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో షాక్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి.
Read More : రైతుబంధు సొమ్ము…పాత బాకిలకు !
గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎర్ర శేఖర్ కు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గీతారెడ్డి, మధుయాష్కి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎర్ర శేఖర్ చేరికను వ్యతిరేకిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గతంలోనే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నించారు. ముహుర్తం కూడా సిద్దమైంది. కాని ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. నేర చరిత్ర ఉన్న వాళ్లను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. గాంధీ సిద్దాంతాలు నమ్మే కాంగ్రెస్‌లోకి నేరగాళ్లు వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎర్ర శేఖర్ ను పార్టీలో చేర్చుకోవద్దని హై కమాండ్ కు లేఖ రాశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోదరుడి హత్య కేసులో ఎర్ర శేఖర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసును కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
Read More : టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో తుంగతుర్తి నుంచి వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. ఆయణ్ని 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా రవిని పార్టీలో చేర్చుకున్నారు కోమటిరెడ్డి. దీనిపై తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న అద్దంకి దయాకర్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పీసీసీ కూడా రవి చేరికతో పార్టకి సంబంధం లేదని ప్రకటించింది. అంతేకాదు తనను కలిసేందుకు వడ్డేపల్లి రవి వచ్చినా రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేశారు. ఈ ఘటన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరువు తీసిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఎర్ర శేఖర్ చేరికతో పార్టీలో కోమటిరెడ్డికి ప్రాధాన్యత లేదనే చర్చ సాగుతోంంది.
ఇవి కూడా చదవండి …
- సాధించాల్సింది.. ప్రజలకు చేయాల్సింది ఎంతో ఉంది..
- ఉగ్రవాద సంస్థతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు లింకులు
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడు…!!
- సామాన్యుడిపై గ్యాస్ భారం…
3 Comments