
క్రైమ్ మిర్రర్, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది.
నిజామాబాద్ లో యువతకు సామాజిక సేవ పేరుతో కరాటే శిక్షణ ఇస్తూ మతపరమైన దాడులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలతో అబ్దుల్ ఖాదర్ అనే కరాటే మాస్టర్‌ను అరెస్ట్ చేశారు . మతం పేరిట నిజమాబాద్లో దాదాపు ఇప్పటి వరకు 200 మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇవ్వగా ఇందులో హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, కడప, వరంగల్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మరణాయుధాలు , నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి .
నిందితులలో కొందరిని అరెస్టు చేయగా అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు ఉండటంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also Read : సామాన్యుడిపై గ్యాస్ భారం…
ఉగ్రవాద సానుభూతి సంస్థలో జగిత్యాల వాసులు
వాస్తవానికి ఉగ్రవాద ఛాయలు, సంబంధాలు ఉమ్మడి జిల్లాకు ఇదే తొలిసారి కాదు. రెండు దశాబ్దాల కింద ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలలో జరిగిన ఉగ్రవాది భారీ ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి దేశంలో అలజడి రేపేందుకు ఓ ఉగ్ర సానుభూతి సంస్థలో జగిత్యాల వాసులు కీలక పాత్ర పోషించాడన్న వార్తలు మరోసారి చర్చ నీయాంశంగా మారాయి. కరోనా తరువాత జగిత్యాలలో ఇలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు, ఇంటెలిజెన్స్, ఎస్బీ నిఘా తీవ్రతరం చేశాయి. దీంతో అలాంటి వారంతా ఇక్కడ నుంచి నిజామాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో ఉగ్రమూలాలు అక్కడితోనే అంతమైపోలేదు. 2005 ఆగస్టు 9న ఉదయం 9.30 గంటల సమయంలో హైదరాబాద్ – ముంబై ప్లాట్ఫారం మీద ఓ బ్యాగులో ఉంచిన టిఫిన్ బాక్స్ పేలింది. దాదాపు 20 మంది ప్రయాణికు లు గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు . వాస్తవానికి ఆ రోజు సాంకేతిక పొరపాటు వల్ల బాంబు పూర్తిస్థాయిలో పేలలేదని , పేలి ఉంటే దాని తీవ్రతకు ప్రాణ నష్టం కూడా అధికంగా సంభవించి ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు .
2021 జూన్ 17న బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది. లష్కర్ – ఎ – తొయిబా శిక్షణ పొందిన యువకులు కొందరు సికింద్రాబాద్‌లో పార్సిల్ సెక్షన్లో ద్రవరూపంలో ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్రెజివ్ డివైజ్ (ఐఈడీ ) ను వాడి పేలుడుకు పాల్పడ్డారు. వాస్తవానికి ఈ బాంబు సికింద్రాబాద్ నుంచి దర్బంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రామగుండం రైల్వేస్టేషన్ దాటేలోగా పేలాలి . అలా జరగకపోవడంతో భారీ ప్రాణన ష్టం తప్పింది .
Also Read : నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం…
అసలు ఎవరి ఈ ఖాదర్ పాషా..?
1990 ల దశకంలో ఆజం ఘోరీ అనే వ్యక్తి పీపుల్స్ వార్ గ్రూప్‌లో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. వరంగల్‌లో జరిగిన ఓ బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి పాకిస్థాన్‌కు వెళ్లి లష్కరే తోయిబాలో చేరాడు. చురుకైన యువకుడు కావడంతో లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాద నాయకుల దృష్టిలో పడ్డాడు. దీంతో ప్రత్యేకంగా అతన్ని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల వద్ద శిక్షణ కోసం లష్కరే నాయకులు పంపించారు. ఇక 1992 లో ఘోరీ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడు . మొదట యువతను ఆకట్టుకునేలా పలు శారీరక శిక్షణా కార్యక్రమాలు రహస్యంగా నిర్వహించేవాడు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం అతని అడ్డాపై రైడ్ చేసింది . అప్పుడే ఘోరీ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్ మరణించాడు. దీంతో పోలీసు నిఘా వర్గాల్లో ఆజం ఘోరీ పై ఫోకస్ మరింత పెరిగింది .
తరువాత జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అజమ్ ఘోరి చనిపోయాడు. అప్పటి ఆజం ఘోరీ ఉగ్ర సంస్థలో ఒక్కడైనా అబ్దుల్ ఖాదర్ మళ్లీ నిజామాబాద్‌లో కరాటే మాస్టర్ గా చేరి పలువురు యువతను ఆకర్శించి అమాయక యువత జీవితాలు నాశనం చేయాలని భావిస్తున్నారని పోలీసులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడు…!!
టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
2 Comments