
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా రాజకీయ వాతావరణం హిటేకన్నుంది.అధికార వైసిపి పార్టీ ప్లినరి వేల, టిడిపి కౌంటర్ ప్లాన్ కోసం సిద్ధమైంది.నేటి నుండి టడిపి అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పటు పార్లమెంటరి నియోజకవర్గాల వారిగా సీమ జిల్లాలలో పర్యటించనున్నారు. ఇదే సమయంలో 7, 8 తేదిలలో ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలో పర్యటించేల షెడ్యుల్ ఖరారైంది.ఈనెల 8 న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ తన కుటుంబ సబ్యులతో కలసి వైఎస్ఆర్ జన్మదినోత్సవం సందర్భంగా నివాళులు అర్పిస్తారు.అక్కడి నుండి మంగళగిరి వధ నిర్వహించనున్న వైసిపి రెండు రోజుల ప్లినరికి హాజరవుతారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా వచ్చే ఎన్నికల్లో పోటి చేసే అబ్యార్దుల విషయంలో క్లారిటి ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అధికారికంగా ప్రకటించక పాయిన ఖరారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
also read : కేసీఆర్ పై బండి సంజయ్ బ్రహ్మాస్త్రం.. వణికిపోతున్న టీఆర్ఎస్ లీడర్లు! ఏం జరగబోతోందో? –
ఇక సిమ జిల్లాలలో ముందుగానే అబ్యార్ధులను ఖరారు చేసి వారికీ ప్రజలతో మమేకం అయ్యేలా అవకాశం ఇవ్వలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటు జగన్ సైతం ప్లీనరీ వేదికగా 2024 ఎన్నికల్లో అబ్యార్దుల ఖరారు పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టిడిపి అధినేత ఈరోజు నుండి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జిల్లా మహానాడు, నియోజకవర్గ సమీక్షలు, బదుడే బాదుడు కార్యక్రమంలో బాగంగా రోడ్డు షో లు నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలంలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఈనెల 8 న చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో జరగనున్నది. రాజంపేట-అన్నమయ్య జిల్లాల్లో వైసిపి పట్టున్న నియోజకవర్గాలపై భవిష్యత్ వ్యూహం చంద్రబాబు ఖరారు చేయనున్నారు.
also read : సినిఫక్కిలో గంజాయి రవాణా…ఉప్పల్లో 440 కిలోల గంజాయి పట్టివేత…..
ఇక 8, 9 తేదిలలో వైసిపి ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈసమయంలోనే చంద్రబాబు వైసిపి కంచుకోటల్లో పర్యటించి… ప్లినరి వేళ కొత్త రాజకీయానికి తేర తీస్తున్నారు. నాడు మేలో టిడిపి ఒంగోలులో నిర్వహించిన మహానాడు సమయంలో అధికార వైసిపి సామజిక న్యాయ యాత్ర పెరుతో మంత్రులు బస్సు యాత్రను నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు కీలక నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని…..వైసిపి ప్లినరి వేళ…కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. దీంతో ఈనాలుగు రోజులు ఎపిలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం నెలకొంది.
ఇవి కూడా చదవండి…
బహిరంగ సభా వేదికపైనే ప్రధాని మోడీతో రోజా సెల్ఫీ.. చిరంజీవితో ఏం చేసిందో తెలుసా….
ప్రధాని సభకు డుమ్మా కొట్టిన ఎంపీ రఘురామ..!
3 Comments