
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో వలసల జోరు కొనసాగుతోంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహ్మరెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి షాక్ తగలబోతుందని తెలుస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం త్వరలోనే కారును వీడి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
Read More : మైనర్లతో మద్యం రవాణా… ఆన్‌లైన్ బుకింగ్ బాయ్స్‌గా మారిన చిన్నారులు
కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు వీరేశం. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో ఆయన పొసగడం లేదు. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, ఎమ్మెల్యే చిరుమర్తికే హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుందని భావించిన వేముల వీరేశం అధికార పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డితో వీరేశం మాట్లాడటం కూడా జరిగి పోయిందని అంటున్నారు. ఈనెల 11న గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. 2014లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. తర్వాత చిరుమర్తి కూడా టీఆర్ఎస్ లో చేరారు. అప్పటినుంచి వీరేశం, చిరుమర్తి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా తీవ్రరూపం దాల్చాయి.
ఇవి కూడా చదవండి …
- ఈటలతో కలిసి ఢిల్లీలో కోమటిరెడ్డి.. అమిత్ షాతో చర్చలు? జూలై 3న బీజేపీలో చేరిక?
- చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ కొత్త నాటకం: కిషన్‌రెడ్డి
4 Comments