
క్రైమ్ మిర్రర్, బాలాపూర్ : ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్న అసంతృప్తుల జాబితా కూడా పార్టీలో పెరిగిపోతోంది. ఏకంగా కొందరు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇదిలాఉండగా హైదరాబాద్ శివారు బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read More : అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. కాగా టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే: మేయర్ పారిజాత ఈ సందర్భంగా పారిజాత మాట్లాడుతూ.. బడంగ్ పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపు నిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు.
Also Read : ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్ఎస్ వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్ తో పాటు 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి సైతం టీఆర్ఎస్ కు రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2020 జనవరిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 31వ వార్డు కార్పొరేటర్ గా పారిజాత విజయం సాధించారు. అప్పట్లో మేయర్ పదవి ఇచ్చేలా ఒప్పందం జరగడంతో ఆమె టీఆర్ఎస్ లో చేరి మేయర్ పదవి దక్కించుకున్నారు. కొంతకాలంగా పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అనుచరుల వద్ద వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి …
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
- కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ! మోడీ అందుకే ఆయన పేరు ఎత్తలేదా?
- రేవంత్ రెడ్డికి బిగ్ షాక్… కాంగ్రెస్ కూటమికే కేసీఆర్ సపోర్ట్ !
- ఆటోపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్.. 8 మంది సజీవదహనం
2 Comments