
- అక్రమాలను చూస్తు ఊరుకోను.. ఆమరణ నిరాహారదీక్ష చేస్తా
- కబ్జాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారని తీగల ఆరోపణలు
- చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, రంగా రెడ్డి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. మంత్రి సబితను కబ్జా కోరని ఆరోపించారు.
Read More : రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. బడంగ్ పేట మేయర్
మీరుపేటను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలను చూస్తు ఊరుకోనని.. ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలో భూ కబ్జాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారని తీగల ఆరోపించారు. ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారని అన్నారు. చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి సబిత గెలవలేదన్న తీగల కృష్ణారెడ్డి.. మంత్రి అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తానని చెప్పారు. సబితతో తాడో పేడో తేల్చుకుంటానని తీగల కృష్ణారెడ్డి హెచ్చరించారు.
Read More : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగే షాక్.. పోతే పోనీ అనుకుంటున్నారా?
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మె్ల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. 2014లో టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు తీగల కృష్ణారెడ్డి. తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో సబిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత మంత్రి అయ్యారు. సబిత కారెక్కినప్పటి నుంచి తీగలతో ఆమెకు విభేదాలు వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలో సబిత, తీగల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నేతలను పట్టించుకోకుండా.. కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వాళ్లకే సబిత ప్రాధాన్యతగతంలో చాలా సార్లు సబిత తీరుపై ఓపెన్ గానే విమర్శలు చేశారు తీగల. దీంతో తీగల పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. కాని తీగల మాత్రం ఖండిస్తూ వస్తున్నారు.
Also Read : చదువుల మంత్రి సబితమ్మపై బిజెపి కార్పొరేటర్ యుద్ధం
మహేశ్వరం నియోజకవర్గంలో కొన్ని రోజులు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహరెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సబిత వ్యవహార శైలి వల్లే మేయర్ పార్టీ మారారనే టాక్ వస్తోంది. బడంగ్ పేట మేయర్ రాజీనామా చేసిన మరుసటి రోజే మంత్రి సబితను తీగల కృష్ణారెడ్డి టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. తీగల కూడా పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. తీగలతో రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఈనెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు… ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
- ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?
- ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
2 Comments