
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నట్లు నిజంగానే మన రాష్ట్రం బంగారు తెలంగాణే. పీఆర్‌ఎస్ అనే సంస్థ తాజాగా ఇచ్చిన ఓ నివేదికలో ఇదే రుజువైంది. అయితే బంగారు తెలంగాణ ప్రజలు జీవన స్థితిగతుల్లో కాదు. ఎమ్మెల్యేల జీతాల్లో పీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం దేశంలో ఎమ్మెల్యేలకు అత్యధికంగా వేతనాలు ఉన్నది తెలంగాణే. శాసనసభ సభ్యుల జీతాలు పెంచేందుకు ఢిల్లీ అసెంబ్లీ ఇటీవల ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన ఐదు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం వెంటనే వారి జీతాల్లో 66శాతం పెరుగుదల కనిపించనుంది. ప్రస్తుత జీతం రూ.12వేలు కాగా తాజా పెంపుతో అది రూ.30వేలు కానుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎమ్మెల్యేలకు జీతభత్యాలు మొత్తం కలిపి నెలకు రూ.54వేలు వస్తుండగా అది రూ.90వేలకు చేరనుంది. అయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం తక్కువే.
Read More : కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ! మోడీ అందుకే ఆయన పేరు ఎత్తలేదా?
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎమ్మెల్యేల జీతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ లో ఉంది, తర్వాత స్థానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. జీతం హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఉండగా.. ఇతరత్రా అలవెన్సులో కలిపితే మిగితా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో బంగారు తెలంగాణ రాష్ట్రం ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల జీతం అత్యధికంగా రూ.55వేలు. వీటికి అదనంగా నియోజకవర్గం ఖర్చులు 90వేలు, రోజువారీ భత్యం రూ.1800, సెక్రటేరియట్ అలవెన్స్ రూ.30వేలు, టెలిఫోన్ బిల్లులు రూ.15వేలు చెల్లిస్తున్నారు. ఇలా మొత్తంగా నెలకు లక్షా 90వేలు దాటుతుంది. తెలంగాణలో ఎమ్మెల్యేల నెల జీతం రూ.20వేలు. నియోజకవర్గం భత్యం మాత్రం అత్యధికంగా రూ. 2.3లక్షలుగా ఉంది. మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు నెలకు రెండున్నర లక్షల వేతనంగా పొందుతారు.
Read More : తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
కేరళ చట్టసభ సభ్యుల జీతం రూ.28 వేలు తక్కువ. కేరళలో సెక్రటేరియల్ అలవెన్సులు లేవు. నియోజకవర్గం భత్యం మాత్రం రూ.25వేలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల జీతం రూ.12వేలు. వారి నియోజకవర్గ అలవెన్సు మాత్రం రూ.1.13లక్షలు. తమిళనాడులో ఎమ్మెల్యేల జీతం రూ.30వేలు కాగా నియోజకవర్గం భత్యం రూ.25వేలు. ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేలు రూ.20వేలు జీతంగా తీసుకుంటుండగా వారి నియోజకవర్గం ఖర్చులు రూ.1.5లక్షలు. ఇతర అలవెన్సులతో కలిపి మొత్తంగా వారికి రూ.1.82లక్షలు అందుతుంది. పంజాబ్‌లో ఎమ్మెల్యేల జీతభత్యాలు కలిసి నెలకు రూ.95వేలు అందుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యేల జీతం రూ.25వేలు. నియోజకవర్గ భత్యం రూ.30వేలు. ఆర్డర్లీ, మెడికల్ అలవెన్సుల పేరుతో మరో రూ.55వేలు అందుతుంది. మిజోరాం ఎమ్మెల్యేల జీతం రూ.80వేలు కాగా నియోజకవర్గం భత్యం రూ.40వేలుగా ఉంది. ఇతర అలవెన్సులు కలిపి వీరికి మొత్తం రూ.1.50లక్షలు జీతభత్యాల రూపంలో వస్తాయి. పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేల జీతం రూ.21వేలు. రోజువారీ భత్యం (రోజుకు రూ.2వేలు) కలిపి నెలకు రూ.81వేలకుపైగా వస్తుంది.
ఇవి కూడా చదవండి …
- ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది..
- టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్
- రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. బడంగ్ పేట మేయర్
- కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగే షాక్.. పోతే పోనీ అనుకుంటున్నారా?
- బహిరంగ సభా వేదికపైనే ప్రధాని మోడీతో రోజా సెల్ఫీ.. చిరంజీవితో ఏం చేసిందో తెలుసా?
One Comment