
క్రైమ్ మిర్రర్, అమరావతి : మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ హరిచందన్ విశ్వభూషన్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. భీమవరంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఏపీ మంత్రి అర్కే రోజా హల్చల్ చేశారు.
Read More : కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగ! మోడీ అందుకే ఆయన పేరు ఎత్తలేదా?
కేంద్ర పర్యాటక, టూరిజం శాఖ నిర్వహించిన అల్లూరు 125వ జయంతి వేడుకల్లో ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి ఆర్కే రోజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సభా వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోడీ సహా ముఖ్య అతిథులను సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అంతేకాదు సభ ముగిసిన తర్వాత వెళ్లడానికి సిద్ధమైన ప్రధాని నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగారు మంత్రి రోజా. ప్రధాని నరేంద్ర మోడీని కాసేపు ఆపేసి సెల్ఫీ తీసుకున్నారు రోజా. సీఎం జగన్, చిరంజీవి కవర్ అయ్యేలా ప్రధాని మోడీతో మరో సెల్ఫీ తీసుకున్నారు. చిరంజీవితో చాలా ఫోటోలు దిగారు. సభా వేదికపై మంత్రి రోజా చేస్తున్న హడావుడి చూస్తూ ఇతర నేతలు నవ్వుకున్నారు.
ఇవి కూడా చదవండి …
- ప్రధాని సభకు డుమ్మా కొట్టిన ఎంపీ రఘురామ..!
- విశ్వా కర్మల నిరసన అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా.
- తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
- ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు… ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..