
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ సంథింగ్ స్పెషల్. దూకుడు రాజకీయాలు చేసే కోమటిరెడ్డి బ్రదర్స్ కి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వర్గమే బలమైంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్సార్ హయాంలో పార్టీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో భువనగిరి ఎంపీగా గెలిచారు. 2014లో రెండోసారి పోటి చేసి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవికి పోటీ పడ్డారు. కాని హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చింది.
Read More : మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఢీలా పడ్డారు. రోజురోజుకు పార్టీలో వాళ్ల పవర్ తగ్గుతూ వస్తోంది. నల్గొండ జిల్లాలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు కోల్పోయారనే టాక్ వస్తోంది. తాజాగా పార్టీ హైకమాండ్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది
భువనగిరి ఎంపీ పరిధిలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే కోమటిరెడ్డి కండువా కప్పిన వడ్డేపల్లి రవి చేరిక చెల్లదని ప్రకటించి కోమటిరెడ్డికి చుక్కలు చూపించారు పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్.
Also Read : ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పోటీ చేసి గాదరి కిషోర్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అద్దంకి దయాకర్ ఓటమికి వడ్డేపల్లి రవి కారణమని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వడ్డేపల్లి రవి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. దీంతో వీరిద్దరి మధ్య ఓట్లు చీలిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్ విజయం సాధించారు.దీంతో టీపీసీసీ వడ్డేపల్లి రవిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఇటీవల ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.వడ్డేపల్లి రవి మొదటి నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఇటీవలే కోమటిరెడ్డికి దగ్గరయ్యారు. దీంతో వడ్డేపల్లి రవిని పార్టీలోకి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి బ్రదర్స్,
Read More : అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
. తిరిగి పార్టీలోకి వచ్చిన రవి టీపీసీసీ అధ్యక్షుడు రేవంతును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లగా చేదు అనుభవం ఎదురైందట. రేవంత్ ఇంట్లో ఉన్నా కూడా రవిని కలిసేందుకు నిరాకరించారట. ఎందుకంటే రేవంత్ మద్దతు అద్దంకి దయాకర్ కు ఉండడమే కారణంగా తెలుస్తోంది. పైగా పార్టీ విధానాలను ధిక్కరించి బహిష్కృత నేతను చేర్చుకునేది లేదని స్పష్టం చేశారట.దీంతో ఈ పంచాయితీ ఏఐసీసీ వరకు వెళ్లింది. అధిష్టానం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. వడ్డేపల్లి రవి నియామకం చెల్లదని ప్రకటించిందట. స్వయంగా ఈ విషయాన్ని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కోమటి రెడ్డి బ్రదర్స్ కు షాక్ తగిలినట్లు అయింది. ఈ ఘటనతో పీసీసీ చీఫ్ పై రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే రేవంత్ పై బ్లాస్ట్ అవుతారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన : హోంమంత్రి
- భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
- ప్రధాని సభకు డుమ్మా కొట్టిన ఎంపీ రఘురామ..!
- తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు